Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ డైరెక్టర్లు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక సినిమా సక్సెస్ కావాలంటే దర్శకుడు యొక్క పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఆయన ఏదైతే చూపించాలి అనుకున్నాడో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించినప్పుడు ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. మరి ఈనెల 4 వ తేదీ నుంచి ఈ సినిమా బెనిఫిట్స్ షోస్ వేస్తున్న నేపధ్యం లో ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మొదటి షో తోనే సక్సెస్ టాక్ ని తెచ్చుకున్నట్లైతే ఈ సినిమా భారీ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అల్లు అర్జున్ తను అనుకున్న విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి పుష్ప 2 సినిమా మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే అల్లు అర్జున్ రేంజ్ మారబోతుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా తెలుగు హీరోలు కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కోసం తీవ్రమైన పోటీ అయితే పడుతున్నారు.
మరి అందులో భాగంగానే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటే నెంబర్ వన్ పొజిషన్ కోసం తనే కూడా పోటీలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక నార్త్ లో ఈయన సినిమాలకు భారీ క్రేజ్ ఉందనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకోసమే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ నార్త్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో నార్త్ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…