Chikiri Chikiri Step: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘చికిరి చికిరి'(Chikiri Chikiri) మేనియా నే కనిపిస్తోంది. నెటిజెన్స్ లో ఈ పాటకు స్టెప్పులు వెయ్యాలి అనే కోరిక మామూలుగా లేదు. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ ని అప్లోడ్ చేస్తున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేదు, అన్ని వయస్సులకు సంబంధించిన వాళ్ళు ఈ పాటకు స్టెప్పులేస్తూ దుమ్ము లేపేస్తున్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యింది అనేది. ఇకపోతే ఈ పాట కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఒక డాక్టర్ ఇన్ స్టాగ్రామ్ రీల్ ద్వారా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో ఎక్కడ చూసినా ప్రతీ ఒక్కరు చికిరి పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ స్టెప్పులను వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ స్టెప్పు కారణం రక్త ప్రవాహం శరీరం లో చాలా బాగా జరుగుతుంది, అంతే కాకుండా గుండెకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో కూడా ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్వయంగా డాక్టర్లే చెప్తున్నారు ఈ స్టెప్పు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఇక ప్రారంభించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా వైరల్ అయ్యింది కాబట్టే ఈ పాటకు కేవలం మూడు వారాల్లోనే 80 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ పాట కేవలం తెలుగు వెర్షన్ నుండి వంద మిలియన్ పైగా వ్యూస్ మార్కుని అందుకోనుంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 న విడుదల చేద్దామని అనుకుంటున్నారు. కానీ అప్పటికి సినిమా విడుదలయ్యే అవకాస్లు చాలా తక్కువ అని సమాచారం. వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని టాక్. మార్చి లో కాకుండా ఏప్రిల్ నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే లోచనలో ఉన్నారు మేకర్స్, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.