వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆప‌రేష‌న్ స‌క్సెసేనా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’. ఎన్నో మలుపుల తర్వాత ఈ శుక్రవారం (ఏప్రిల్ 2) థియేట‌ర్లో విడుద‌లైందీ సినిమా. నాగ్ ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఈ సినిమాను గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేసింది యూనిట్‌. ఈ నేప‌థ్యంలో డ‌బ్బింగ్ చిత్రం ‘సుల్తాన్’తో కలిసి బాక్సాఫీస్ బరిలో నిలిచిందీ మూవీ. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రంగంలోకి దిగిన వైల్డ్ డాగ్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యే అవకాశాలు ఏమేర‌కు ఉన్నాయ‌నేది చూద్దాం. ఓటీటీలో […]

Written By: Bhaskar, Updated On : April 3, 2021 11:56 am
Follow us on


టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’. ఎన్నో మలుపుల తర్వాత ఈ శుక్రవారం (ఏప్రిల్ 2) థియేట‌ర్లో విడుద‌లైందీ సినిమా. నాగ్ ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఈ సినిమాను గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేసింది యూనిట్‌. ఈ నేప‌థ్యంలో డ‌బ్బింగ్ చిత్రం ‘సుల్తాన్’తో కలిసి బాక్సాఫీస్ బరిలో నిలిచిందీ మూవీ. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రంగంలోకి దిగిన వైల్డ్ డాగ్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యే అవకాశాలు ఏమేర‌కు ఉన్నాయ‌నేది చూద్దాం.

ఓటీటీలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆ డీల్ క్యాన్సిల్ చేసుకొని థియేట‌ర్ బాట ప‌ట్టింది. ప్ర‌మోష‌న్ కూడా గ‌ట్టిగా జ‌ర‌గ‌డం, పోటీకూడా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ మంచిగానే సాగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 7.7 కోట్ల మేర బిజినెస్ న‌డిచిన‌ట్టు తెలుస్తోంది. ఇంఉద‌లో నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్ లో 1.2 కోట్లు, ఆంధ్రాలో రూ.4 కోట్ల బిజినెస్ చేసింద‌ని టాక్‌.

అదేవిధంగా.. క‌ర్నాట‌క‌తోపాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి 70 ల‌క్ష‌ల బిజినెస్ జ‌ర‌గ్గా.. ఓవ‌ర్సీస్ హ‌క్కులు రూ.50 ల‌క్ష‌లకు అమ్మేసిన‌ట్టు స‌మాచారం. ఈ విధంగా మొత్తం రూ.9 కోట్ల టార్గెట్ బ‌రిలోకి దిగింది వైల్డ్ డాగ్‌. అయితే.. కార్తీ సుల్తాన్ డబ్బింగ్ కేట‌గిరీలోకి వెళ్లిపోవ‌డంతో ఆడియ‌న్స్ ఫ‌స్ట్ చాయిస్ వైల్డ్ డాగే అయ్యింది. ఈ నేప‌థ్యంలో తొలి రోజు మంచి వ‌సూళ్లు సాధించిందీ చిత్రం మొద‌టి రోజు రూ.3.5 కోట్లు రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. అటు యూఎస్ లోనూ స‌త్తా చాటి, 3,967 డాల‌ర్లు కొల్ల‌గొట్టిన‌ట్టు స‌మాచారం.

అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 5.5 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం ప‌ర్వాలేద‌నిపించాడు నాగ్‌. మ‌రి, లాంగ్ ర‌న్ లో ఈ మూవీ ఎంత మేర క‌లెక్ష‌న్ రాబ‌డుతుంద‌నేది ఆదివారంతో తేలిపోనుంది.