Balakrishna And Manjula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ…అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి నటులు విభిన్న తరహా చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతుంటే కృష్ణ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను చేస్తూ మాస్ హీరోగా మారాడు…ఇక తన తర్వాత ఆయన కూతురు అయిన మంజుల ఇండస్ట్రీకి రావాలని చాలా ఉత్సాహాన్ని చూపించింది. దాంతో కృష్ణ సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్ లలో తనకు అవగాహన ఉండాలని విజయనిర్మల దగ్గర తనని అసిస్టెంట్ గా జైన్ చేయించి దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాడు. ఇక మొత్తానికైతే డైరెక్షన్ కి సంబంధించిన విషయాల్లో కూడా తను చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి చాలా విషయాలను తెలుసుకుంది. అయినప్పటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేసింది. ఇక ఒకానొక సందర్భంలో బాలయ్య బాబు హీరోగా ఘట్టమనేని మంజుల హీరోయిన్ గా ఒక సినిమా చేయాలని కృష్ణ అనుకున్నాడు.
అలాగే ఆ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కృష్ణ అభిమానులు పద్మాలయ స్టూడియోస్ ముందుకి వచ్చి నానా హంగామా చేశారు. కారణం ఏంటి అంటే తమ హీరో కూతురు వేరే హీరోతో కలిసి నటిస్తే మాకు సిగ్గుచేటుగా ఉంటుందని, చాలామంది మా హీరోని ట్రోల్ చేస్తారని అది మాకు నచ్చదని విపరీతమైన హంగామా చేశారు.
ఇక మరికొందరైతే కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించూకోవడానికి కూడా రెడీ అవ్వడంతో కృష్ణ రెస్పెండ్ అవుతూ మంజుల హీరోయిన్ గా చేయడం లేదు అంటూ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దాంతో ఈ గొడవలన్నీ సర్దుమనిగాయి మొత్తానికైతే మంజుల హీరోయిన్ అవ్వకపోవడానికి కృష్ణ అభిమానులు కూడా ఒక కారణమనే చెప్పొచ్చు…
ఇక ఆ తర్వాత ఒక కంటెంట్ బేస్డ్ సినిమాగా ‘షో’ అనే సినిమాతో వచ్చి మంచి సక్సెస్ ని సాధించింది. అయినప్పటికి తను ఫుల్ టైమ్ హీరోయిన్ గా మారాలనుకున్నప్పటికి అది వర్క్ అవుట్ కాలేదు. తర్వాత ప్రొడ్యూసర్ గా, దర్శకురాలిగా తన సత్తాను చాటుకుంది… మొత్తానికైతే తను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకపోవడానికి కృష్ణ అభిమానులే కారణమని తను ఈరోజుకు చెబుతూ ఉంటుంది…అందుకే చాలా రోజుల పాటు కృష్ణ అభిమానులంటే తనకు నచ్చేది కాదని కూడా చెప్తుంది…