Chiranjeevi And Rajinikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ పొజిషన్ లో నిల్చోబెట్టాయి. అలాంటి చిరంజీవి రీసెంట్ గా చేసిన మన శంకర్ వరప్రసాద్ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధించాడు… ఇక తెలుగులో చిరంజీవి ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడో తమిళంలో రజనీకాంత్ సైతం అంతే గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగిన క్రమంలో రజినీకాంత్, చిరంజీవిని హీరోగా పెట్టి తన డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. చిరంజీవికి కథ కూడా వినిపించారట. రజనీకాంత్ డైరెక్షన్ లో చాలా స్టైలిష్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేసినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి అంటే ఆ కథలో కమర్షియల్టి చాలా వరకు తగ్గిందట.
అది చాల రియాలిస్టిక్ సంఘటనలతో ఉండడంతో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా ఉండదనే ఉద్దేశ్యంతో రజనీకాంత్ కొంత వరకు వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రజనీకాంత్ లాంటి స్టార్ హీరో దర్శకత్వంలో చేస్తున్నప్పుడు తన సినిమాలో హీరోని తగ్గించి చూపించకూడదు.
ఇక ఆ క్యారెక్టర్ చిరంజీవి చేస్తే అంత బాగా ఎలివేట్ అవ్వదు. అందుకోసమే తను కాంప్రమైజ్ అయి సినిమాని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇంకేదైనా కమర్షియల్టి ఎలిమెంట్స్ ఉన్న కథతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి రజనీకాంత్ అనుకున్నారట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రజనీకాంత్ మళ్లీ డైరెక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు.
ఒకవేళ వీళ్ళ కాంబోలో సినిమా చేస్తే బాగుండేది అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి సైతం రజినీకాంత్ డైరెక్షన్ లో నటించి ఉంటే ఎలా ఉండేదో అదొక మోమరబుల్ మూవ్ మెంట్ గా నిలిచిపోయేదని భావించే వాళ్ళు సైతం ఉన్నారు…ఇక ఇప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుందా అనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి…