https://oktelugu.com/

RGV: కేటీఆర్ నీ టార్గెట్ అయితే ఇలా ఎందుకు చేశావ్ అంటూ కొండ సురేఖ మీద అదిరిపోయే ట్వీట్ చేసిన ఆర్జీవీ…

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పాలిటిక్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలిటిక్స్ పాల్గొంటున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంటే మాత్రం పొలిటిషన్స్ కి చాలా చిన్న చూపు ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 01:28 PM IST

    RGV

    Follow us on

    RGV: ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకులు సెటైర్లు వేయడం సహజమైపోయింది. ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళ మీద సెటైర్లువేయడం అనేది తరుచుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి ధోరణి కి చరమగీతం పాడే సమయం అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా అధికార పార్టీలో మంత్రి గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న కొండా సురేఖ కూడా నాగార్జున, నాగ చైతన్య సమంత లను ఉద్దేశించి మాటలు మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. ఇక వెంటనే ఆమె మళ్ళీ ఆ విషయంలో తనది తప్పు అయిందంటు క్షమాపణలను కోరింది. ఇక అప్పటికే అక్కినేని ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో అక్కినేని ఫ్యామిలీ కి, సమంతకి ఉన్న క్రేజీ తగ్గిందనే చెప్పాలి.

    అందుకే నాగార్జున ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని కొండా సురేఖ మీద కేసును కూడా నమోదు చేశాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆర్జీవి ఇప్పుడు కొండా సురేఖ మీద మరొక ట్వీట్ చేయడం విశేషం… కొండా సురేఖ కేటీఆర్ కి గురి పెట్టింది. కానీ నాగార్జున, నాగచైతన్య లను కాల్చింది.

    ఇక ఫైనల్ గా సమంత కు సారీ చెప్పింది. నిజానికి ఐన్ స్టీన్ కి కూడా ఈ ఈక్వేషన్ అర్థమై ఉండకపోవచ్చు. అంటూ తను సెటైరికల్ గా ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక ఇదే ఆర్జీవీ రెండు రోజుల క్రితం సురేఖ సమంతను పొగుడుతుంది అంటూ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే ఆర్జీవి ఏది చేసిన కూడా సంచలనంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా మారడమే కాకుండా ప్రేక్షకులందరిలో ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి.

    ఇక లీగల్ గా అక్కినేని ఫ్యామిలీ ముందుకు వెళుతున్న క్రమంలో కొండ సురేఖ కూడా దానిని ఎదుర్కోవడానికి చాలా ఓపికగా ముందుకు సాగుతుంది. మరి మొత్తానికైతే అక్కినేని, కొండ సురేఖ ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుందనే విషయం మీద ఏ ఒక్కరికి సరైన క్లారిటీ అయితే లేదు. చూడాలి మరి ఈ విషయంలో అక్కినేని వాళ్ళు తగ్గుతారా? లేదంటే కొండా సురేఖ వెనకడుగు వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది…