Liger: పూరీ జగన్నాథ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మంచి క్రేజీ ఉంది. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీలుగా నిలుస్తాయని టాక్. ఎప్పుడు కూడా ఏదో ఒక సంచలన విషయం మీదే సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి లైగర్ తీశాడు. సినిమాకు సంబంధించిన ట్రైలర్, పోస్టర్ విడుదలయ్యాయి. సినిమా కూడా విడుదలైంది. కానీ పూరీ స్థాయికి తగినట్లుగా లేదని తెలుస్తోంది. సినిమాపై కామెంట్లు వస్తున్నాయి. వాస్తవాలకు దూరంగా కథ ఉన్నట్లు చెబుతున్నారు.

అసలు తెలుగు సినిమానేనా అనుమానం కూడా అందరిలో వస్తోంది. వాస్తవికతకు దూరంగా తీయడంతో విమర్శలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ తీసిన సినిమా ఇలా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. సెంటిమెంట్ కు పెద్దపీట వేసినా స్క్రీన్ ప్లే గతి తప్పిందని తెలుస్తోంది. రియాలిటీకి ఏ మాత్రం దగ్గరగా లేదని చెబుతున్నారు. పూరీ జగన్నాథ్ సినిమా అంటే మంచి కథ, కథనం ఉంటాయని ఆశించిన ప్రేక్షకులకు భంగపాటే ఎదురవుతోందని టాక్ వస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ అవుతాడనుకుంటే పస లేకుండా పోతోందని తెలుస్తోంది.
Also Read: Lavanya Tripathi: అవకాశాలు కరువు బరువెక్కుతున్న అందాల రాక్షసి లావణ్య
ఇక సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చారు. మదర్ సెంటిమెంట్ ను పండించినా ఓ తప్పు చేశారు. మదర్ సెంటిమెంట్ వెంటనే ఓ పాటను పెట్టారు. అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. దీంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆ పాట హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఫాస్ట్ బీట్ కావడంతో ప్రేక్షకులకు చిరాకు కలుగుతోంది. అసలు తెలుగు సినిమాలో ఇలాంటి సన్నవేశాలు ఎందుకో అర్థం కావడం లేదు. దీంతో పూరీ జగన్నాథ్ ఏం ఊహించి ఆ పాట పెట్టారో కూడా ప్రేక్షకులకు అంతుచిక్కడం లేదు.

హీరో బాక్సింగ్ కోసం లాస్ వేగాస్ కు వెళతాడు. అక్కడ జరిగిన ఫైట్ లో హీరో కిందపడిపోతాడు. ఇదంతా ముంబై నుంచి చూస్తున్న తల్లి తన కొడుకు లేవాలని గట్టిగా అరుస్తుంది. దీంతో హీరోకు వినబడి లేచి మళ్లీ పోరాటం చేయడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవాలకు దూరంగా సినిమా ఉంటుందని పూరీ నిరూపించారు. లైగర్ సినిమా లో ఉన్న ఈ రెండు సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు ప్రారంభించారు. పూరీ మంచి డైరెక్టరే కానీ ఎందుకో లాజిక్ మిస్ అయి నిజాలు కాకుండా అబద్ధాలతోనే సినిమా రూపొందించారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
Also Read:NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్: పులితో ఎన్టీఆర్ పోరాటం.. ఎలా తీశారో మేకింగ్ వీడియో వైరల్