South Heroes Ignore Bollywood Directors: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మన హీరోలు సైతం డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావడం బాలీవుడ్ ప్రేక్షకులకు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు కొత్తగా అనిపించడంతో ఇండియా వైడ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్ కి వెళ్ళింది… ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు సైతం మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మన హీరోలు మాత్రం వాళ్ళని పట్టించుకోవడం లేదు. కారణం ఏంటి అంటే మన దగ్గరే అద్భుతమైన మేకర్స్ ఉన్నారు. వాళ్లతోనే సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించవచ్చని మన హీరోలైతే అనుకుంటున్నారు.
ఇక బాలీవుడ్ దర్శకులు సైతం అవకాశం దొరికితే స్టార్ హీరోలతో సినిమాను చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయిన కూడా వర్కౌట్ కావడం లేదు. వాళ్లు మన హీరోల వెంటపడే కంటే బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించొచ్చు కదా అంటే వాళ్ళు హీరోలుగా చేసిన సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడం లేదు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ‘దురంధర్ ‘ సినిమాని వదిలిపెడితే ఏ సినిమాలు కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కోట్లలో కలెక్షన్స్ ను కొల్లగొట్టడం లేదు. దీనివల్ల మంచి కాన్సెప్ట్ లను బాలీవుడ్ హీరోలతో చేసి దాన్ని చెడగొట్టే కంటే దానిని మంచి మార్కెట్ ఉన్న హీరో తో చేస్తే అది నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని వాళ్ళు భావిస్తున్నారట.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం హీరోలు వాళ్లతో సినిమాలు చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి… రీసెంట్ గా ఆదిత్యధర్ తో సినిమా చేయడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఒక్కడి మీదనే మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళెవరిని పట్టించుకోవడం లేదు. ఇక వాళ్ళు కూడా లైమ్ లైట్లోకి రావాలంటే వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భమైతే ఆసన్నమైంది…