Rajasekhar: హీరో రాజశేఖర్ ఫ్యామిలీ పై రకరకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. సరే ఫ్యామిలీ మ్యాటర్ పక్కన పెడితే.. హీరో రాజశేఖర్ కి డైరెక్టర్లు అంటే గౌరవం లేదు. మొదటి నుంచి రాజశేఖర్ ప్రవర్తన అలాగే ఉంటూ వచ్చింది. అదృష్టం బాగుండి.. మధ్యలో హిట్లు పడి ఎలాగోలా కెరీర్ ను లాక్కొచ్చాడు గానీ, రాజశేఖర్ ఆవేశానికి ఏ దర్శకుడు అతనితో పని చేయలేడు.

దానికి తోడు మధ్యలో జీవితా రాజశేఖర్ ఒకరు. మరి ఆమెకు దర్శకత్వం పై ఎందుకు అంత మక్కువో అర్ధం కాదు. మాట్లాడితే.. స్క్రీన్ ప్లే, దర్శకత్వం జీవితా రాజశేఖర్ అని వేసుకోవడానికి ఆమె తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది. జీవితా రాజశేఖర్ మంచి నటి. అంతేనా ఆ రోజుల్లో హీరోయిన్ గా కూడా ఓ రేంజ్ లో చలామణి అయింది.
ఇక పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి.. రాజశేఖర్ కి వాయిస్ అందించే అర్ధాంగి గానే మిగిలిపోయింది. ఆ బాధ ఆమెలో కూడా ఉన్నట్టు ఉంది. అందుకే దర్శకత్వం చేయాలని కోరిక పుట్టింది. కోరిక పుడితే దర్శకురాలు అయిపోలేదు కాబట్టి.. రాజశేఖర్ సినిమాలకు మధ్యలో దర్శకుడిని పీకేసి.. ఆ దర్శకుడి పేరు బదులు తన పేరు వేసుకోవడంలో జీవితా రాజశేఖర్ బాగా ఆరితేరిపోయింది.
Also Read: Suresh Babu: జగనూ.. చిన్న పరిశ్రమకెందుకయ్యా ఇన్ని ఆంక్షలు ?
మరి ఆ విషయంలో అంత అనుభవం పొందింది గనుక, ఎప్పటిలాగే తనకు చేతనైన విధంగానే దర్శకుడిని మధ్యలోనే తప్పించి.. అతని ప్లేస్ లో తన పేరు వేసేసుకుంది. రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఆ మధ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఒకటి వదిలారు. ఆ లుక్ లో రాజశేఖర్ లుక్ అదిరిపోయింది.
అయితే, ఆ లుక్ ఉన్న పోస్టర్ మీద ఈ చిత్రానికి దర్శకుడు ‘లలిత్’ అనే వ్యక్తి అని అతన్ని దర్శకుడిగా ప్రకటించారు. కాగా తాజాగా రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్, మరియు టీజర్ రిలీజ్ అయ్యాయి. అయితే, టీజర్ లో దర్శకుడు లలిత్ పేరు మారిపోయింది. లలిత్ కి బదులు జీవితా రాజశేఖర్ పేరు కనబడింది. మొదట దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన లలిత్ ఎందుకు తప్పుకున్నాడు ? తప్పెవరిది ?
Also Read: Trivikram: మొన్న రాజమౌళి భయపడ్డాడు, నేడు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు