Sandeep Reddy Vanga : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళ సినిమాలు ఎలాగైతే ఉంటాయో బయట వాళ్ళ బిహేవియర్ కూడా కొన్ని సందర్భాల్లో అలానే ఉంటుంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టరైజేశన్ ను కనక చూసుకున్నట్లయితే షార్ట్ టెంపర్ క్యాండెట్ గా కనిపిస్తాడు. నిజానికి ఆ సినిమా దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగ సైతం బయట అలానే ఉంటాడని టాకైతే ఉంది…
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ గా కూడా ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడం విశేషం… ఇక సందీప్ రెడ్డివంగ ఎప్పుడు కోపంగా కనిపిస్తాడని ఏ మీటింగ్ కు వచ్చినా చాలావరకు ఫైర్ మీదే కనిపిస్తాడు. ఆయనకి షార్ట్ టెంపర్ ఉందని తనకు తానే చెప్పుకుంటూ ఉండటం విశేషం… ఇక అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర కూడా తనదే అంటూ చాలామంది చెప్తూ ఉంటారు…ఎందుకు ఆయన అంత కోపంతో ఉంటాడని తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ షార్ట్ టెంపర్ అనేది అలవాటైపోయిందట. ఏ విషయాన్ని అయినా సరే ఎక్కువగా డిస్కస్ చేయడానికి ఇష్టపడతాడు. కానీ అడ్డదిడ్డంగా ఎవరైనా వాదిస్తే మాత్రం అతనికి నచ్చదు. అందుకే అందరికీ అక్కడే స్ట్రాంగ్ కౌంటర్లు అయితే ఇస్తూ ఉంటాడు…
రీసెంట్ గా ఆయన తండేల్ (Thandel) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు మాత్రం ఆయన చాలావరకు కూల్ గా మాట్లాడాడు. ఇక హీరో నాగ చైతన్య (Naga Chaithanya) సందీప్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడని చెప్పాడు. అలాగే సందీప్ మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి భయమేస్తుంది అంటూ చెప్పాడు…
ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఇంతకు ముందు చాలా సార్లు సందీప్ గురించి గొప్ప మాట్లాడాడు… మనం బతికితే సందీప్ రెడ్డి వంగ లా బతకాలి. ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడిగిన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఎవరికి భయపడడు, చాలా ధైర్యంగా ఉంటాడు. అలాగే చాలా కోపంగా కూడా ఉంటాడు అని చెబుతూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ ఇండస్ట్రీలో సినిమాలు తీయడం లో ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా పర్సనల్ గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు… అందుకే ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటూ అంటారు…ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతందని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తుండటం విశేషం…