RRR Team: ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలు దగ్గరకు వచ్చేశాయి. తెలుగు సినిమా లోకమే కాదు.. ప్రపంచ సినీలోకం కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘బాహుబలి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శక ధీరుడు తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పిక్చర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఈ చిత్రంలో భారీ తారగణంతో పాటు కథా బలం ప్రధానంగా ఉందని విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఇందులో మూవీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. కానీ, రామ్ చరణ్ తేజ్ కనిపించలేదు. చెర్రీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణాలపై ఫోకస్..

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూసి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమానా.. మజాకా..అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విజ్యువల్ వండర్‌గా ఉండబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, ఆలియా భట్, ప్రొడ్యూసర్ దానయ్య హాజరయ్యారు. రామ్ చరణ్ మాత్రం మిస్సయ్యారు. దాంతో కావాలనే ముంబై ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్‌ను తప్పించారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ, నిజం అది కాదు.
ముంబైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని రాజమౌళి రామ్ చరణ్‌కు చెప్పారు. కానీ, తన ఫ్యామిలీలో జరుగున్న ఓ పూజా కార్యక్రమంలో రామ్ చరణ్ ఉండిపోయాడు. ఆ కారణం వల్లే చరణ్ రాలేదని రాజమౌళి చెప్పాడు. తన బంధువుల వివాహ వేడుకల్లో నూతన వధూవరులతో పాటు చరణ్-ఉపాసన జంటగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అందుకే చరణ్ ముంబై ప్రెస్ మీట్‌కు రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అయితే, రామ్ చరణ్‌ను ముంబైకి తీసుకురావాలని చివరి వరకు ప్రయత్నించారు మూవీ యూనిట్ సభ్యులు.
Also Read: Pushpa Movie: “పుష్ప” మూవీ తేడా కొడితే చావుకు సిద్దం అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్…
హైదరాబాద్‌లో నిర్వహించే ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి హాజరు కాబోతున్నారు. మూవీ యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ట్రైలర్ చూసి బాలీవుడ్ మీడియా స్టన్ అయింది. సినిమా డెఫినెట్‌గా బ్లాక్ బాస్టర్ అవుతుందని మీడియా ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నందుకు అక్కడి మీడియా ప్రతినిధులు వెల్‌కమ్ చెప్పారు. ఇక సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ మూడు వేరియేషన్స్‌లో ఉండబోతుందన్న సంగతి ట్రైలర్ ద్వారా స్పష్టమవుతున్నది.
Also Read: మళ్లీ బిజీ కాబోతున్న హాస్య దిగ్గజం !