Vidya Balan : విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈమెకు అభిమానులే. తనదైన శైలితో, అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ‘భూల్ భూలయ్యా 3’ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్య నటనను ప్రజలు బాగా ఇష్టపడ్డారు. ఆమె ‘మేరే ధోల్నా’ పాటలో కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది. అయితే విద్య ఒకప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కోసం హోటల్ బయట అడుక్కోవడానికి సిద్ధమైందట. అయితే ఈ ఫన్నీ సంఘటనను నటి స్వయంగా ఓ సినిమా ప్రమోషన్‌లో పంచుకుంది. అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఏం జరిగిందంటే?
విద్యాబాలన్ ‘నియత్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నప్పుడు, ఆమె ఒక సంఘటన గురించి పంచుకుంది. బిస్కెట్ ప్యాకెట్ కోసం ఫైవ్ స్టార్ హోటల్ బయట అడుక్కోవడానికి కూడా తాను ఎలా సిద్ధం పడిందో తెలిపింది విద్యా బాలన్. అయితే విద్య తన మ్యూజిక్ బృందంతో ఈ ఫీట్ చేసిందట.
విద్య 5 స్టార్ హోటల్ బయట ఏం చేసిందంటే?
Mashableకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి మాట్లాడుతూ, “మాకు ఒక సంగీత బృందం ఉండేది. మేము ప్రతి సంవత్సరం శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించాము. ఈ ఆర్గనైజింగ్ కమిటీలో నేను వాలంటీర్‌ని. కచేరీ అర్థరాత్రి వరకు జరిగేది కాబట్టి ప్రోగ్రామ్ ముగించుకుని నేనూ, నా స్నేహితులూ కలిసి నారిమన్ పాయింట్‌కి వాకింగ్‌కి వెళ్లేవాళ్లం. అప్పుడు నా స్నేహితులు నన్ను ఒబెరాయ్ ది పామ్స్ కాఫీ షాప్ గేటు వద్దకు వెళ్లి అక్కడ నుంచి తినడానికి ఏదైనా తీసుకు రమ్మని చెప్పారు. నేను ఈ పందెం గెలిస్తే, నాకు ఇష్టమైన బిస్కెట్స్ ఇస్తామన్నారు. నేను అక్కడికి వెళ్లి అంటే కాఫీ షాప్ బయటికి వెళ్లి గేటు కొట్టాను.
విద్యాబాలన్ ఇంకా మాట్లాడుతూ, “నేను అక్కడికి వెళ్లి ఆహారం అడగడం స్ట్రార్ట్ చేశాను. కంటిన్యూగా అడుగుతున్నాను. అయితే వెంటనే నా స్నేహితులు ఏదైనా జరుగుతుంది కావచ్చు అని వారు నన్ను పిలిచారు అని చెప్పింద విద్యాబాలన్. చివరకు తానే ఈ టాస్క్‌లో గెలిచిందట. ఇతర స్నేహితుల నుంచి అదనపు బిస్కెట్ల ప్యాకెట్లను పొందిందట. అది కూడా తనకు ఇష్టమైన బిస్కెట్. ఈ ఛాలెంజ్‌ని గెలిచినందుకు చాలా సంతోషించాను అంటూ తను హోటల్ బయట అడిగిన విధానాన్ని తెలిపింది విద్యాబాలన్.
విద్యాబాలన్ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 3 2024 సంవత్సరంలో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మాత్రమే కాదు ఆమె దో ఔర్ దో ప్యార్ చిత్రంలో కూడా కనిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విద్యా చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేవట.