Telangana Caste Census: అగ్రవర్ణాలు అంటే.. తెలంగాణలో వెలమ, రెడ్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, తదితర కులాలను భావిస్తారు. తెలంగాణలో వెలమ, రెడ్డి, బ్రాహ్మణ సామాజికవర్గం వారే అగ్రవర్ణాలుగా పనిగణింపబడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో వీరిదే పెత్తనం. దొర, పటేల్ పేర్లతో బీసీలు, దళితులతో పిలిపించుకున్నారు. భూములు వారి చేతుల్లోనే ఉండేవి. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, భూపరిధి చట్టం, చదువు అందరికీ అందుబాటులోకి రావడంతో మిగతా సామాజికవర్గాలు కూడా ఎదుగుతున్నాయి. రిజర్వేషన్ల ఫలితంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా కుల గణన చేపట్టకపోవడంతో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఉన్న రిజర్వేషన్లే 75 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కుల గణన చేసి వాటి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు 2024లో కుల గణన చేపట్టింది. దానికి సబంధించిన నివేదికను ప్రభుత్వం ఆదివారం(ఫిబ్రవరి 2న) విడుదల చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
తగ్గిన అగ్రవర్ణాలు..
కుల గణన నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 46.25 శాతం ఉన్నారు. అంటే 1.24 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఆ తర్వాత అగ్రవర్ణాలు అంటే ఓసీలు 18 శాతం ఉన్నారు. అయితే వీరిలో ఓసీ ముస్లింలు 2.5 శాతం ఉన్నారు. వీరిని తీసేస్తే హిందూ అగ్రవర్ణాలు 15.79 శాతం మాత్రమే. ఇదే సమయంలో ఎస్సీలు 17.43 శాతం ఉన్నారు. అంటే 61,84,319 మంది ఉన్నారు. ఎస్టీలు 37,05,929 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం 10.45 గా ఉంది.
భారీగా ముస్లిం జనాభా..
ఇక తెలంగాణలో ముస్లిం జనాభా భారీగా ఉంది. 44,57,012 మంది ఓసీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 12.56 శాతంగా ఉంది. అంటే గిరిజన జనాభాకన్నా ముస్లిం జనాభా పెరిగింది. ఇక బీసీ ముస్లింలను విడిగా లెక్కించారు. వారి సంఖ్య 35,76,588 గా తేలింది. మొత్త జనాభాలో 10.08 శాతంగా ఉన్నారు. మొత్తంగా 96,9 శాతం జనాభాను సర్వే చేశామని, 3,54,77,554 మంది వ్యక్తుల వివరాలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని తెలిపారు. మరో 1.68 లక్షల మంది తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపింది.
అగ్రవర్ణాల తగ్గుదల..
రాష్ట్రంలో ప్రజలకు సామాజిక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించడం వలన, బడుగు బలహీన వర్గాల జనాభా పెరిగింది. అగ్రవర్ణ కుటుంబాలు పెద్దగా పట్టు కట్టిన ప్రాంతాల కంటే, వార్షిక ఆదాయం ఎక్కువగా ఉండే, పట్టణాల వైపు వెళ్లడం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి జనాభా తగ్గింది. ఈ విధంగా, అగ్రవర్ణ జనాభా తగ్గడం వారి సంఖ్యలో తగ్గుదల మాత్రమే కాకుండా, సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పుల సంకేతాలుగా భావించవచ్చు.