Samantha- Naga Chaitanya: సమంత,చైతూ విషయంలో ఈ డైరెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు?

సమంత విజయ దేవరకొండ కాంబినేషన్ లో రీసెంట్ గా ఖుషీ సినిమా వచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విడుదల అయిన దగ్గర నుంచి మంచి కలెక్షన్లతో దూసుకొని పోయింది ఖుషీ సినిమా.

Written By: Suresh, Updated On : October 13, 2023 6:05 pm
Follow us on

Samantha- Naga Chaitanya: సమంత నాగచైతన్య విడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ వీరి మీద రూమర్స్ ఆగడం లేదు. ఎప్పుడు కలుస్తారంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు అభిమానులు. వీరి పోస్టులను చూసిన ప్రతి సారి ఆసక్తితో ఎదురుచూస్తారు. అయితే రీసెంట్ గా చైతన్య పోస్టు వల్ల మళ్లీ కలుస్తారు అనుకున్న అభిమానులు సమంత పోస్టు తర్వాత ఇక కలవరేమో అనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఓ డైరెక్టర్ వీరి లైఫ్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

సమంత విజయ దేవరకొండ కాంబినేషన్ లో రీసెంట్ గా ఖుషీ సినిమా వచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విడుదల అయిన దగ్గర నుంచి మంచి కలెక్షన్లతో దూసుకొని పోయింది ఖుషీ సినిమా. ఇద్దరి స్టార్లు కూడా ఈ మధ్య హిట్ లు లేక దిగులు చెందిన విషయం తెలిసిందే. కానీ ఖుసీ సినిమా తర్వాత మరోసారి కెరీర్ లో హైప్ వచ్చేసింది. ఇక డీసెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకోవడం తో పాటు లాంగ్ రన్‌ లో కూడా మంచి వసూళ్లు సాధించింది ఖుషీ సినిమా. అయితే ఈ సినిమాను సమంత కావాలని శివ నిర్వాన తో చేయించింది అంటూ టాక్ వచ్చింది.

నాగచైతన్యను నొప్పించడానికే ఇలా శివతో ఖుషీ సినిమా డైరెక్ట్ చేయించిందనే టాక్ వచ్చినా కూడా చిత్ర యూనిట్ మౌనం వహించింది. దీంతో ఈ పుకార్లు మరింత ఎక్కువ అయ్యాయి. కానీ సినిమా విడుదల అయిన తర్వాత సమంత, చైతూల పెళ్లి, విడాకులకు ఈ సినిమాకు అసలు సంబంధమే లేదు అని నమ్మేశారు నెటిజన్లు. అయితే సమంతతో సినిమా తెరకెక్కించడం వల్ల శివ అంటే చైతూకి కోపం వచ్చింది కావచ్చే అని కూడా కొందరి వాదించారు.కానీ దీనికి కూడా పులిస్టాప్ పెడుతూ ఇప్పుడు మరో న్యూస్ వినిపిస్తోంది.

ప్రస్తుతం చైతూ చేస్తున్న చందు మొండేటి సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత శివ నిర్వాన దర్శకత్వం మరో సినిమా చేయబోతున్నారట చైతూ. గతంలో వీరిద్దరి కాంబోలో మజిలి సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌ గా సమంత నటిస్తే హీరో చైతూ. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సామ్, చైతూలను కలిపి సినిమా ను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాన ఇప్పుడు విడి విడిగా ఇద్దరి తో సినిమాలు చేస్తున్నాడు.సమంత తో తీసిన ఖుషీ సినిమా హిట్ ను అందుకోగా వెంటనే చైతూతో సినిమాకు సిద్దమయ్యాడు.

అయితే నాగ చైతన్య తో శివ నిర్వాన తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా నటిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అభిమానులు. కానీ అది అసాద్యం. విడాకులు తీసుకున్న ఈ జంట కలిసి నటించే అవకాశమే లేదు. మరి చూడాలి నటన కదా అని ఒప్పుకుంటారా? లేదా మరొ కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా అనేది? అయినా సమంత సినిమాలో వేరే హీరోను పెట్టినప్పుడు.. చైతూ సినిమాలో మరో హీరోయిన్ ఉండదా? అంటూ కూడా ప్రశ్నలు సందిస్తున్నారు ఇద్దరి అభిమానులు. చూడాలి మరీ ఈ వార్త ఎలాంటి మలుపు తిరుగుతుందో…