Ram Charan
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, రెండవ సినిమా ‘మగధీర’ తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి స్టార్ హీరోల లీగ్ లోకి చేరిన రామ్ చరణ్, తన బాక్స్ ఆఫీస్ స్టామినా తో యావరేజ్ సినిమాలను కూడా సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఈ సినిమాలు అప్పట్లో ఎలా హిట్ అయ్యాయిరా బాబు అని మనం టీవీ లో చూసినప్పుడు అనుకుంటూ ఉంటాము, అందుకు కారణం రామ్ చరణే. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బ్రూస్లీ – ది ఫైటర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ ఫ్లాప్ సినిమాకి వచ్చిన వసూళ్లు 40 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ స్థాయి వసూళ్లు అప్పట్లో కొంతమంది స్టార్ హీరోల సూపర్ హిట్స్ కంటే ఎక్కువ.
తక్కువ సినిమాలతో ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు కాబట్టే రామ్ చరణ్ అంటే ఒక వర్గం జనాలకు కడుపు మంట. ఒకప్పుడు యాక్టింగ్ మీద విపరీతమైన ట్రోల్స్ చేసేవాళ్ళు. ‘రంగస్థలం’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే రేంజ్ నటన కనబర్చడంతో రామ్ చరణ్ ని విమర్శించిన నోర్లు మూసుకున్నాయి. ఎవరైతే ఆయన్ని విమర్శించారో, వాళ్ళ చేతనే పొగిడించుకునే రేంజ్ లో నటించాడు. ఇక ఆ తర్వాత #RRR చిత్రం తో ఆయన అందుకున్న ప్రశంసలు గ్లోబల్ వైడ్ గా ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తండ్రి కోసం చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. దురాభిమానుల సంబరాలు చేసుకున్నారు. ఇక ఆ తర్వాత శంకర్ దర్శకత్వం లో మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.
ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అని అనడం కంటే ఉద్దేశపూర్వకంగా తెప్పించారు అని అనొచ్చు. పనిగట్టుకొని ఒక నలుగురి హీరోల అభిమానులు రేయింబవళ్లు ఈ చిత్రంపై విషయం కక్కడమే డ్యూటీ గా పెట్టుకున్నారు. ఒకరి పరాజయం కోసం ఇంతలా తపిస్తున్నారంటే, ఆ హీరో విజయం సాధిస్తే ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా కొడుతాడో వాళ్లకు అర్థం అయ్యే ఉంటుంది. 20,30 సినిమాలు చేసినా రానటువంటి స్టార్ డమ్ కేవలం 10 సినిమాలకే రామ్ చరణ్ దక్కించుకున్నాడు అనే అసూయ ప్రతీ ఒక్కరిలోనూ ఉందనే విషయం ‘గేమ్ చేంజర్’ చిత్రంతో అర్థమైంది. ఇంత నెగటివిటీ చేసినా కూడా ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను కేవలం మూడు రోజుల్లో రాబట్టింది. ఇలాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో కి సరైన స్క్రిప్ట్ పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న బుచ్చి బాబు చిత్రం అలాంటిదే. ఛాలెంజింగ్ రోల్స్ లో చెలరేగిపోయే రామ్ చరణ్, ఈ చిత్రంతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతున్నాడు. ఆరోజు ఇప్పుడు ఏడ్చినవాళ్లంతా ఏమైపోతారో చూడాలి.