Allu Arjun : ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని కొన్ని అడల్ట్ రేటెడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా ఇలాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలు ఈమధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయి. దీంతో కొంతమంది దర్శకులు ఏమి మాట్లాడినా ఆడియన్స్ సరదాగా తీసుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. నిన్న సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘మజాకా’ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ని మూవీ టీం మొత్తం ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ సినిమాతో ‘మన్మథుడు’ మూవీ హీరోయిన్ అన్షు రీ ఎంట్రీ ఇస్తుంది. ఆమె పై ఆ చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన నిన్న చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. తండ్రి వయస్సున్న వ్యక్తివి, ఒక అమ్మాయి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతావా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంతకు ఆయన చేసిన కామెంట్స్ ఏమిటంటే ‘అన్షు చాలా కాలం తర్వాత మా సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ అమ్మాయిని చూసారు గా చాలా సన్నగా ఉంది. నేను మా తెలుగు వాళ్లకి ఇంత సన్నగా ఉంటే నచ్చదు అమ్మా, కొంచెం పెంచు, అన్నీ పెంచాలి అప్పుడే మా ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలవు అన్నాను. అలా చెప్పబట్టే ఈ మాత్రం అయినా తయారైంది’ అంటూ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియా లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన నెగటివిటీ రావడంతో నేడు ఆయన క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న మజాకా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు మహిళలందరి మనోభావాలు దెబ్బ తీసినట్టు అనిపించాయని నాకు సమాచారం వచ్చింది’.
‘ఇది కేవలం నేను నవ్వించడానికి చేసిన ప్రయత్నం లో ఎదో పొరపాటున నోరు జారాను, అంతే కానీ కావాలని మాట్లాడలేదు. అయినాసరే మీ అందరూ మనసు నొప్పించింది కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. పెద్ద మనసు చేసుకొని దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. అన్షు కూడా నాకు కూతురు లాంటిదే. ఆమె కూడా బాధపడుతుంటే క్షమాపణలు చెప్తున్నాను. కామెడీ కోసం మా హీరోయిన్ ని ఏడిపించే ప్రక్రియ లో ఒక స్టార్ హీరోని అనుసరించి, వెక్కిరించినట్టు ఆ హీరో అభిమానులు ఫీల్ అయ్యారని తెలిసింది. అది కూడా కావాలని చేసింది కాదు, అక్కడ ఉన్నవాళ్ళని ఆటపట్టించడానికి మాత్రమే. కానీ ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఆ హీరో అభిమానులకు కూడా క్షమాపణలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.