https://oktelugu.com/

Shriya Saran : ఆ కారణాల వల్లే శ్రియ ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉండగలుగుతోందా?

ఇలా అన్ని విషయాలలోనూ తనకంటూ తాను ఒక లైన్ పెట్టుకొని.. కంట్రోల్ లో ఉండగలిగింది కాబట్టే ఈ హీరోయిన్ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా అదే గ్రేస్ తో కొనసాగుతోంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 30, 2023 / 02:29 PM IST
    Follow us on

    Shriya Saran : ఒకప్పుడు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోతో చేసిన హీరోయిన్ ఎవరు అంటే ముందుగా శ్రియా పేరే గుర్తొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అల్లరి నరేష్ వరకు ప్రతి హీరోతోను స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ హీరోయిన్. 2001 వ సంవత్సరం ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ, అన్ని భాషలలో కలిపి దాదాపు 75 చిత్రాలకు పైగానే నటించింది.

    హాలీవుడ్ లో సైతం రెండు సినిమాలను చేసింది. దాదాపు ఆన్ని భాషలలో నటించ్చిన శ్రియా కెరియర్ లో తెలుగు భాషకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా శ్రియ కొనసాగింది టాలీవుడ్ లోనే. తన మొదటి సినిమా విడుదల అయ్యి 23 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కూడా శ్రియకి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

    10 సంవత్సరాలకు మించి ఒక హీరోయిన్ తెలుగు సినిమాలలో నటించలేదు అనుకున్న వారికి శ్రియ అవి ఏవి నిజం కాదు.. హీరోల లాగా హీరోయిన్లు కూడా ఎన్నో సంవత్సరాలు కొనసాగ గలరు అని రుజువు చేసింది. ఇందులో చెప్పుకోదక్క విషయం ఏమిటి అంటే శ్రియ ఎక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయలేదు. అంటే శ్రియ అక్కగా, వదినగా ఏ సినిమాలోను కనిపించలేదు.‌ ఈ 23 సంవత్సరాలు కూడా తాను ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే, అది కూడా హీరోయిన్ గానే చేస్తూ ఉండడం విశేషం.

    అయితే ఇది శ్రియకే ఎలా సాధ్యం అయింది అంటే దానికి చాలా కారణాలే ఉన్నాయి. అన్ని విషయాలలోనూ శ్రియ చాలా న్యూట్రల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న శ్రియ హీరోలతో ప్రేమ అంటూ ఎప్పుడూ తిరగలేదు. అంతెందుకు తరుణ్ తో నటించ్చిన హీరోయిన్ అందరూ దాదాపు ఆ హీరోతో ప్రేమలో పడ్డారు అనే వార్తలు ఉన్నాయి. అలాంటి తరుణ్ తో మూడు సినిమాలు చేసిన శ్రియ అతనికి ఫ్రెండ్ గా ఉండింది తప్ప ఎప్పుడూ ప్రేమించలేదు.

    ఇక చాలా విషయాలలో తాను పెద్దగా ఇంటర్ఫియర్ కాదు. అనవసరమైన వివాదాలకు పోదు. ఎక్స్పోజింగ్ విషయంలో తప్ప శ్రియపైన దాదాపు ఈ 23 సంవత్సరాల్లో ఏ విషయంలోనూ కాంట్రవర్సీ అనేది రాలేదు. ఆఖరికి శ్రియ కూతురుని కనడం కూడా మీడియాకు తెలియకుండా దాచిపెట్టి కనేసింది. ఇక అందం మైంటైన్ చెయ్యడంలో శ్రియ తర్వాతే ఎవరైనా. తాను నటించిన 75 పైగా సినిమాలలో ఏ ఒక్క సినిమాల్లో కూడా ఈ హీరోయిన్ లావయింది అని మనకు అనిపివ్వదు. ఎక్కువగా యోగా మెడిటేషన్ చేసే శ్రియ, ఫుడ్ విషయంలో కూడా చాలా కంట్రోల్ గా ఉంటుంది.

    ఇలా అన్ని విషయాలలోనూ తనకంటూ తాను ఒక లైన్ పెట్టుకొని.. కంట్రోల్ లో ఉండగలిగింది కాబట్టే ఈ హీరోయిన్ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా అదే గ్రేస్ తో కొనసాగుతోంది.