https://oktelugu.com/

Game Changer: గేమ్ చెంజర్ విషయం లో శంకర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు…

అభిమానులు శంకర్ పట్ల చాలా కోపానికి గురవుతున్నారు ఎందుకు అంటే రెండు నెలల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన సినిమాల అప్డేట్ అనేది ఆ డైరెక్టర్లు ఇస్తూ వస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 6, 2023 / 08:11 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్క్ సినిమాలను చేస్తూ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శంకర్… ఆయన చేసిన జెంటిల్ మేన్ సినిమా నుంచి రోబో 2.0 సినిమా వరకు ప్రతి ఒక్క సినిమా కూడా టెక్నాలజీని సరికొత్త రీతిలో వాడుకుంటూ సినిమాలు చేస్తు ప్రేక్షకులందరినీ అలరించడంలో ఈయన ఎప్పుడు ముందుంటాడు. ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి రికార్డులను అందుకోవడమే కాకుండా ఒకానొక టైంలో ఇండియాలో ఈయన నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా కొనసాగాడు. అయితే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోని పెట్టుకొని శంకర్ గేమ్ చెంజర్ అనే ఒక సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా బయటికి రాలేదు.

    దీంతో అభిమానులు శంకర్ పట్ల చాలా కోపానికి గురవుతున్నారు ఎందుకు అంటే రెండు నెలల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన సినిమాల అప్డేట్ అనేది ఆ డైరెక్టర్లు ఇస్తూ వస్తున్నారు. అలాగే టీజర్లతో వల్ల అభిమానులను అలరిస్తున్నారు. కానీ రామ్ చరణ్ సినిమా నుంచి ఒక్క టీజర్ కూడా వదలకుండా శంకర్ రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వాళ్లు చాలా ఓపిక పట్టి ఎదురుచూస్తున్నారు అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా రాకపోవడంతో మరి తీవ్రమైన అసహనానికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే శంకర్ సినిమాలు చాలా వరకు లేట్ గా రిలీజ్ అవుతు ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేస్తాడు కాబట్టి వాటికి సంబంధించిన పనుల్లో ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటాడు అందుకే ఆయన ఒక సినిమాకి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటాడు.

    ఆయన సినిమా సినిమాకి మధ్య ఇక ఎక్కువ సమయం తీసుకుంటూ సినిమాని బాగా తీయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన గేమ్ చేంజర్ ముందు స్టార్ట్ చేసిన ఇండియన్ 2 సినిమా అప్పుడు ఆగిపోయింది, కానీ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసి ఆ సినిమాని కూడా చేయాల్సి వస్తుంది. అందువల్లే గేమ్ చెంజర్ సినిమా లేట్ అవుతుంది అంటూ గేమ్ చెంజర్ మూవీ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చాడు.అయినప్పటికీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం సినిమా రాకపోయినా కూడా కనీసం ఒక టీజర్ ఇవ్వండి అంటూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అయిన కూడా సినిమా యూనిట్ పట్టించుకోక పోవడం తో ప్రస్తుతం వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారనే చెప్పాలి.

    ఆ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ వదిలితే కొద్దిరోజుల పాటు టీజర్ ని చూస్తూ అభిమానులు ఆనందపడతారు అంటూ చాలామంది అభిమానులు అంటున్నారు. అయినప్పటికీ ఆయన ఏమి పట్టించుకోవట్లేదు. దీంతో గేమ్ చెంజర్ సినిమా మీద రోజు రోజుకి అభిమానుల్లో హైప్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పటికైనా శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని వదిలితే బాగుంటుందని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు…