Chalaki Chanti Health: జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు చలాకి చంటి.తనదైన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో చలాకి చంటి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బుల్లితెర ద్వారా వచ్చిన పాపులారిటీ కారణంగా ఈయనకి సినిమాల్లో కూడా ఆఫర్స్ వెల్లువలాగా కురిసాయి. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని,ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు చంటి.
అయితే గత కొద్దిరోజుల నుండి చంటి కి గుండెపోటు వచ్చిందని, ఆయనకీ ICU లో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారని,ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం గానే ఉందని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. అయితే వీటిల్లో ఎంతమాత్రం నిజం ఉంది అనేది అధికారికంగా ఎవరికీ తెలియదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియా నుండి మెయిన్ మీడియా వరకు పాకేసింది.
ఈ వార్తపై అటు చలాకి చంటి కుటుంబ సభ్యులు కానీ, ‘చంటి అన్నా’ అంటూ తిరిగే జబర్దస్త్ కమెడియన్స్ కానీ ఎవరూ స్పందించలేదు. తమ చుట్టూ ఎప్పుడు తిరిగే వ్యక్తి గురించి ఇంత పెద్ద వార్త సోషల్ మీడియా లో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచారం అవుతుంటే ఒక్కరు కూడా పట్టించుకోరా అంటూ చలాకి చంటి అభిమానులు సోషల్ మీడియా లో ఆరోపణలు చేస్తున్నారు.
ఒకవేళ చంటి ఆరోగ్యం బాగుంటే ఆయన బాగానే ఉన్నాడు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయినా చెప్పాలి కదా, ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు. ఒకవేళ చంటి ఆరోగ్యంగా ఉంటే ఆయన అలాగే సంపూర్ణ ఆరోగ్యం తో నిండు నూరేళ్లు జీవించి మమల్ని నవ్విస్తూ ఉండాలని. ఒకవేళ ఆయన ప్రాణాపాయ స్థితి లో ఉంటే వెంటనే కోలుకోవాలని చలాకి చంటిని అభిమానించేవాళ్ళు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.