Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఫేమ్ ఫేస్ అంటే ముందుగా గుర్తు వచ్చేది శివాజీ. ఈయన ఇందులో ఎంట్రీ ఇస్తారు అని ఎవరు ఊహించలేదు. కానీ శివాజీ ఎంట్రీతో బిగ్ బాస్ లో ఏక చక్రాధిపత్యం అన్నట్టుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే టైటిల్ విన్నర్ కూడా శివాజీ అంటున్నారు చాలా మంది. అంతే కాదు బిగ్ బాస్ కూడా ఈ నటుడిపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. ఇంతకీ ఎందుకు బిగ్ బాస్, నాగార్జున శివాజీపై అంత ప్రేమ చూపిస్తున్నారు అనే విషయం ఓ సారి మీకోసం…
అందరిపై పెత్తనాలు చెలాయిస్తూ.. బిగ్ బాస్ పై నోరు పారేసుకుంటూ.. ఇతర కంటెస్టెంట్స్ మీదకు వెళుతూ కాస్త ఇబ్బందిగా బిహేవ్ చేస్తున్నాడు శివాజీ. ఇంత చేసినా కూడా ఈయనను బిగ్ బాస్ గాని, నాగార్జున గానీ ఒక్క మాట అనరు. శివాజీ నే వెనకేసుకొని వస్తారు. ఎలాంటి రూల్స్ లేవన్నట్టు గానే ఉంటుంది ఈ నటుడి ప్రవర్తన. దీంతో ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్ పక్కా శివాజీనే అనే టాక్ వినిపిస్తుంది. కొన్ని సార్లు ఘాటుగా మాట్లాడుతుంటాడు శివాజీ. గ్రూప్ లు మెయింటెన్ చేస్తూ ఇతర గ్రూపులపై ద్వేషంగా ఉన్నట్టుగా ఉంటుంది ఈయన ప్రవర్తన. రీసెంట్ గా ఎవరినో ఒకరిని బాగా కొట్టేసి ఇంటి నుంచి వెళ్లిపోతాను అన్నాడు శివాజీ. దీంతో నాగార్జున ఈ విషయంపై ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. దురుసుగా ఆన్సర్ ఇచ్చాడు శివాజీ. కానీ నాగార్జునకు కొంచెం కూడా కోపం రాలేదు. కానీ ఆట సందీప్ బొంగు అనే పదం వాడితే మాత్రం క్లాస్ ఇచ్చాడు నాగార్జున. అయితే బిగ్ బాస్, నాగార్జున మాత్రమే కాదు కంటెస్టెంట్స్ కూడా శివాజీకి జై కొట్టడంతో మరింత కలిసి వస్తున్నట్టుగా ఉంది. రతికా, ప్రశాంత్ ఇలా అందరూ తన గ్రిప్ లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుండడంతో శివాజీ ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశ్యంతో ఆడుతున్నాడు ఈ నటుడు. అయినా బెస్ట్ కంటెంట్ పట్ల కాస్త ప్రేమ చూపిస్తే పర్వాలేదు కానీ ఇలా శివాజీ మీద స్టార్ మా యాజమాన్యం ఎందుకు ఇంత స్పెషల్ గా ట్రీట్ చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. మరి చివరి వరకు ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందేమో చూడాలి.