Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు (Nagwshwara Rao) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున(Nagarjuna) తన కెరీర్ మొదట్లో భారీ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన చేసిన ఎక్స్పరిమెంటల్ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడంతో ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసే హీరోగా నాగార్జున మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 99 సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున తన వందో సినిమాని చేయడానికి మాత్రం చాలా వరకు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ (kuli) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక దాంతోపాటుగా మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపును సంపాదించకుండా శేఖర్ కమ్ముల (Shekar Kammula) డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర ‘ (Kubera)సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని చేయడానికి కొంతమంది దర్శకులు చెప్పే కథలను అయితే వింటున్నాడు. ఇక వాటిలో ఏ స్టోరీని ఫైనల్ చేస్తాడు ఎవరికి తన వందో సినిమా డైరెక్షన్ చేసే అవకాశాన్ని అందిస్తాడనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు.
కాబట్టి కొంచెం లేట్ అయిన పర్లేదు కానీ తన వందో సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు ఆయన ఎంటైర్ కెరియర్లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అందువల్లే ఆయన నవమన్మధుడిగా కింగ్ నాగార్జున గా మంచి ఐడెంటిటిని అయితే సంపాదించుకున్నాడు.
మరి తన కొడుకుల విషయంలో కొంతవరకు తడబడనప్పటికి ఏది ఏమైనా కూడా నాగార్జున చేయబోయే సినిమాలతో మాత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించి అక్కినేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున ప్రస్తుతం కొంతమంది పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.
వాళ్ళు ఎవరు అనే విషయాలను గొప్యంగా ఉంచుతున్నప్పటికి తొందర్లోనే తన వందో సినిమాని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇంతకీ నాగార్జునతో తన వందో సినిమా డైరెక్షన్ చేసే డైరెక్టర్ ఎవరు కొత్త దర్శకుడా లేదంటే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…