Bigg Boss 5 Telugu: ‘తెలుగు బిగ్ బాస్ సీజన్ 5’ ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయింది. అయితే, ఆ 19 మందిలో ఫిమేల్ కంటెస్టెంట్లు తక్కువగా ఉన్నారు. అదేంటో గాని, వరుసగా ఆ ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. విచిత్రంగా ముందుగా ఎలిమినేట్ అవుతున్న వాళ్ళంతా ఆడవాళ్లు అవ్వడమే ఆశ్చర్యకరం. ఇప్పటివరకు ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ప్రియా కూడా ఎలిమినేట్ అయింది. అంటే..వరుసగా హౌస్ నుంచి ఆరో భామ కూడా బయటకు వచ్చేసింది.

బయటకు వచ్చిన వారి లిస్ట్ చూస్తే.. లహరి, హమీద, ఉమాదేవి, శ్వేత వర్మ, సరయు, ప్రియా… ఇలా సాగింది ఆడోళ్ళ సాగనంపు. అసలు వరుసగా ఆడవాళ్లనే బిగ్ బాస్ ఎందుకు బయటకు పంపిస్తున్నాడు ? నిజానికి ఆడవాళ్ళ కారణంగానే బిగ్ బాస్ ను ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఆడవాళ్లను అందర్నీ ఇలా బయటకు తొలేస్తే ఎలా ? హౌస్ లో గ్లామర్ తగ్గిపోతోందనే ఆలోచన బిగ్ బాస్ కు ఎందుకు లేదో ? .
ప్రస్తుతానికి హౌస్ లో కాజల్, అని, సిరి, ప్రియాంక సింగ్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆట ఇంకా 50 రోజులకి పైనే ఉంది కాబట్టి.. మరి ఇకనైనా వీళ్ళను హౌస్ లో కంటిన్యూ చేస్తారా ? లేక వీళ్ళను కూడా బయటకు పంపి, బిగ్ బాస్ సీజన్ 5ను మగాళ్ల షోగా మార్చేస్తారా ? అనేది చూడాలి. అయితే, ఉన్న ఆడవాళ్లను పంపేసిన.. హౌస్ లో మరింత గ్లామర్ ను నింపేందుకు కొత్త కంటెస్టెంట్ లను వైల్డ్ కార్డు ద్వారా దింపుతారని ఓ ప్రచారం జరుగుతుంది.
ఆ రూమర్ లో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యాంకర్ విష్ణు ప్రియా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే విష్ణు ప్రియా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. హౌస్ లో అందగత్తెలు ఉన్నారు. కానీ, వాళ్ళు బోల్డ్ బ్యూటీలే కనిపించడం లేదట.
అందుకే, ఆ లోటును తీర్చడానికే విష్ణు ప్రియా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఎంట్రీతో హౌస్ లో హాట్ నెస్ కి ఇక అడ్డు అదుపు ఉండదు అని టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో !