https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’కి దూరంగా ఉంది అతనొక్కడే !

Pushpa: ‘పుష్ప’ సినిమా విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా ప్ర‌మోష‌న్లు కూడా చాలా న‌త్త‌న‌డ‌క‌న సాగాయి. ఒక విధంగా పుష్ప సినిమాకి వచ్చిన టాక్ కి, అలాగే వచ్చిన కలెక్షన్స్ కి సంబంధం లేదు. అదృష్టం బాగుండి, ఈ సినిమాకి హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే, అది పుష్ప వాపు తప్ప, బలుపు కాదు అని టాక్. తెలుగు సినిమాకి ప్రస్తుతం హిందీలో ఫుల్ గిరాకీ ఉంది. అందుకే, లైగర్ పై కూడా హిందీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 1, 2022 / 05:58 PM IST
    Follow us on

    Pushpa: ‘పుష్ప’ సినిమా విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా ప్ర‌మోష‌న్లు కూడా చాలా న‌త్త‌న‌డ‌క‌న సాగాయి. ఒక విధంగా పుష్ప సినిమాకి వచ్చిన టాక్ కి, అలాగే వచ్చిన కలెక్షన్స్ కి సంబంధం లేదు. అదృష్టం బాగుండి, ఈ సినిమాకి హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే, అది పుష్ప వాపు తప్ప, బలుపు కాదు అని టాక్. తెలుగు సినిమాకి ప్రస్తుతం హిందీలో ఫుల్ గిరాకీ ఉంది.

    Pushpa

    అందుకే, లైగర్ పై కూడా హిందీ జనం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు సినిమా అంటే చాలు, హిందీ నెటిజన్లు ఆ సినిమాకి తెగ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే, హిందీలో పుష్ప సినిమాకి అరా కొర ప్ర‌మోషన్లే చేసినా.. హిందీలో ఆ సినిమాకి మంచి లాభాలే వచ్చాయి. అయినా ఒక్క బాలీవుడ్ లోనే కాదు, మిగిలిన చోట్లా కూడా పుష్ప టీమ్ బలమైన ప్రమోషన్స్ ను చేయలేదు.

    రిలీజ్ తర్వాత థ్యాంక్స్ మీట్లు పెడుతూ హడావుడి చేసింది గానీ, సినిమాకి ముందు మాత్రం కనీస ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయితే చేసిన ప్రమోషన్స్ కి దాదాపు సినిమాలోని న‌టీన‌టులు అందరూ వచ్చారు. అలాగే సాంకేతిక నిపుణులంతా హాజ‌ర‌య్యారు. కానీ, పుష్ప రిలీజ్ కి ముందు నుంచీ.. సినిమా హిట్ ఫంక్షన్స్ లో కూడా ఎక్కడా ఫ‌హ‌ద్ ఫాజిల్ మాత్రం కనిపించలేదు.

    పుష్ప సినిమాలో భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌ లాంటి కీలక పాత్ర‌లో ఫ‌హ‌ద్ ఫాజిల్‌ నటించాడు. పైగా పార్ట్ 2లో అతని పాత్ర చాలా కీలకం. ఒకవిధంగా పుష్ప యుద్ధం అంతా భ‌న్వ‌ర్‌తోనే ఉండబోతుంది. ఏది ఏమైనా పుష్ప సినిమా మొత్తంలో బన్నీ తర్వాత, సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అంటే మాత్రం ఫాజిలే. మరి అలాంటి కీలకమైన నటుడు ఆ సినిమా ప్రమోషన్స్ లో దేనిలో ఎందుకు పాల్గొనలేదు ?

    ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పైగా ఈ సినిమా కోసం ఫాజిల్ కి భారీ పారితోషికం ఇచ్చారు. ఆ పారితోషికం అతని సినీ జీవితంలోనే ఎక్కువ. పైగా తెలుగు సినిమాలో ఫాజిల్ న‌టించ‌డం కూడా ఇదే మొదటిసారి. మలయాళంతో పోల్చుకుంటే తెలుగు సినిమాకి మార్కెట్ ఎక్కువ. కాబట్టి, ఫ‌హ‌ద్ ఫాజిల్‌ ఈ సినిమా పై ఎక్కువ ఆసక్తి చూపించాలి.

    Also Read: Induvadana Telugu Movie Review: `ఇందువదన` రివ్యూ

    కానీ, ఫ‌హ‌ద్ ఫాజిల్‌ మాత్రం పుష్ప సినిమా ప్ర‌మోష‌న్ల‌లో అస్సలు క‌నిపించ‌లేదు. కారణం.. అతని చేసిన కామెంట్స్ అని తెలుస్తోంది. సుకుమార్ టేకింగ్ పై ఫ‌హ‌ద్ ఫాజిల్‌ నెగిటివ్ కామెంట్స్ చేశాడని, సుక్కు – ఫ‌హ‌ద్ ఫాజిల్‌ కి మధ్య చిన్న గొడవ కూడా జరిగింది అని పుకార్లు వినిపించాయి. అందుకే ఫ‌హ‌ద్ ఫాజిల్‌ పుష్పకి దూరంగా ఉన్నాడని తెలుస్తోంది.

    Also Read: Radhe Shyam: వాయిదా వైపే అడుగులా ? ‘రాధేశ్యామ్’ది ‘ఆర్ఆర్ఆర్’ దారేనా ?

    Tags