Sukumar And Buchi Babu: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన.. అగ్రశ్రేణి దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా, ‘రంగస్థలం’ వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక సతమతమయ్యారు. అయితే ‘రంగస్థలం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించి, ఆ తర్వాత ‘పుష్ప’ సిరీస్‌తో పాన్-ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి గ్లోబల్ రేంజ్‌కు ఎదిగారు.
Also Read: పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ మీదనే ఇన్ని విమర్శలు వస్తే మరి మహేష్ బాబు లుక్ పరిస్థితి ఏంటి..?
సుకుమార్ తన ఎదుగుదలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, తనతో పాటు ప్రయాణించిన శిష్యులకు కూడా గొప్ప అవకాశాలు కల్పించారు. ఇందుకోసం ఆయన ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, తన శిష్యుల్లో ప్రతిభ ఉన్నవారికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఈ శిష్యరికంలో నుంచి వచ్చినవారే బుచ్చి బాబు సానా, శ్రీకాంత్ ఓదెల వంటి వారు.
*ఉప్పెనతో బుచ్చి బాబు సంచలనం
బుచ్చి బాబు తన మొట్టమొదటి చిత్రం ‘ఉప్పెన’ తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని పరిశ్రమను ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుతమైన విజయంతో, ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ కి దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు.
*’పెద్ది’ పై సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ! ఆ కారణం అదేనా?
బుచ్చి బాబు ఇంత ఎదిగినా, సుకుమార్ మాత్రం ఆయనపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా నిర్మాణంలో సుకుమార్ ఇన్పుట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. కథ విషయంలో, ముఖ్యంగా కీలక సన్నివేశాల విషయంలో సుకుమార్ సలహాలు అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజం అన్నది క్లారిటీగా తెలియదు.
నిన్న విడుదలైన ‘పెద్ది’ చిత్రం నుండి ‘చికిరి..చికిరి’ అనే పాటలో సుకుమార్‌ను మనం అతిథిగా చూడవచ్చు. ఒక దర్శకుడిగా, తన శిష్యుడి సినిమా సెట్స్‌కు క్యాజువల్‌గా వచ్చి వెళ్లడం సహజమే. అయితే, ఈ పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లేదా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగలేదు. దేశంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగింది. అలాంటి ప్రాంతానికి కూడా సుకుమార్ వెళ్లడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
దీనిని చూసిన నెటిజన్లు, సుకుమార్ ప్రమేయం ఈ సినిమాపై లేదంటే ఎవరూ నమ్మరు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
* రెండు రహస్యమైన వీడియోలు రూమర్!
అయితే, ఈ ప్రత్యేక శ్రద్ధ వెనుక ఒక సంచలనమైన రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సుకుమార్, కేవలం ప్రేమతోనే కాకుండా, మరో కారణంతో బుచ్చి బాబుపై ఇంత శ్రద్ధ చూపిస్తున్నారని టాక్.
ఆ రూమర్ ఏమిటంటే… సుకుమార్‌కు సంబంధించిన రెండు రహస్యమైన వీడియోలు బుచ్చి బాబు దగ్గర ఉన్నాయని, అందులో ఒక వీడియోలో సుకుమార్ ఒక స్టార్ హీరోను బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి సమక్షంలోనే ఈ తిట్ల పర్వం కొనసాగడంతో వారిద్దరూ విడిపోతే ఇది బయటకు వస్తుందన్న కారణంతోనే కలిసి సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తిట్లు అయినా.. ప్రశంస అయినా ఈ కారణంగానే సుకుమార్ బుచ్చి బాబుని వదిలిపెట్టకుండా అన్ని విషయాల్లో సాయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇలా టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది. దీనిపై అటు సుకుమార్ కానీ, బుచ్చిబాబు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఇది చక్కర్లు కొడుతోంది..
ఈ రూమర్‌లో ఎంత నిజముందో తెలియదు కానీ, ఒక పాట షూటింగ్‌లో కేవలం ఒక సెకను కనిపించినందుకే ఇటువంటి కథనాలు అల్లడం సరైనది కాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజం ఏదైనా, సుకుమార్ – బుచ్చి బాబుల మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.