Shankar’s : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకుంటున్నారు… ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ లాంటి దర్శకుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక మ్యాజిక్ అయితే చేస్తూ వస్తున్నాడు. కెరియర్ మొదట్లోనే ఎన్నో ఎక్స్పరమెంట్లు చేసిన ఆయన గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో దిట్ట…ఆయన లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అంటూ చాలా గర్వంగా చెప్పుకునే వ్యక్తి అలాంటి దర్శకుడు దాదాపు పది సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోవడం విశేషం. ఇక ఆయన నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా డిజాస్టర్లను మూట గట్టుకుంటుంటే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్’ అనే సినిమాని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
శంకర్ సినిమా అంటే హై లెవెల్ గ్రాఫిక్స్ తో భారీ సెట్టింగ్స్ తో సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. మరి అలాంటి శంకర్ డబ్బులను మంచినీళ్ల రూపంలో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఒక్క ఫైట్ కోసమే దాదాపు కొన్ని కోట్ల వరకు ఖర్చుపెట్టి ఆ ఫైట్ ని తను అనుకున్న రేంజ్ లో తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు కూడా శంకర్ గారే కావడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ టీజర్ అయితే అందులో చాలా కలర్ ఫుల్ లొకేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి లొకేషన్స్ ని తను ఎక్కడ ఎలా పట్టుకుంటాడు అది శంకర్ కి మాత్రమే ఎలా సాధ్యమవుతుంది. దానిని అందంగా చిత్రీకరించి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరా అనేంతలా అనుమానం కలిగేలా ఆయన లొకేషన్స్ ని పిక్ చేసుకుంటూ ఉంటాడు.
ఇక శంకర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ ని తమ అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే శంకర్ మరోసారి గ్రాండ్ సక్సెస్ ని కొట్టి పెద్ద హీరోలతో మరోసారి సినిమాలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక లేకపోతే మాత్రం తనకి స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు చాలా తక్కువగా ఉంటాయి…