https://oktelugu.com/

Akkineni Nageswara Rao : అక్కినేనికి తన కూతురును ఇవ్వనని మేనమామ ఎందుకు అన్నారు?

చెడు సావాసాలు చేయను అని మాట ఇవ్వడంతో తల్లి మద్రాసు పంపిందట. అలా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని తన కంటూ స్పెషల్ ముద్ర వేసుకొని ఇప్పటికీ కూడా తన పేరును మారుమోగేలా చేసుకున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 2, 2024 / 09:01 PM IST

    Akkineni Nageswara Rao

    Follow us on

    Akkineni Nageswara Rao : తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ పేరు రావడానికి అక్కినేని నాగేశ్వర రావు కారణం అని చెప్పడంలో సందేహం లేదు. ఈయన నటించిన సినిమాలు సూపర్ హిట్ లను అందుకున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ రెండు కళ్లలా గా ఉండేవారు. అక్కినేని నాగేశ్వరరావు మనసును హత్తుకునే ఎన్నో లవ్ స్టోరీలను తీసి ఆకట్టుకున్నారు కూడా. సినిమా కెరీర్ సాఫీగానే సాగింది కానీ పర్సనల్ లైఫ్ లో ఊహించని కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఆయన పెళ్లి ఒకటి.

    అక్కినేని కుటుంబం చాలా ప్యూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిందని టాక్. వీరి కుటుంబంలో ఎవరు కూడా పెద్దగా చదువుకోలేదట. ఆయన సోదరులు పొలం పనులు చేసేవారు. వారికి అప్పటికే పాతిక ఎకరాల భూమి ఉండేదట. అయితే ఏఎన్నార్ కు పొలం పనులు నచ్చక చదువుకోవాలని భావించేవారట. కానీ తన తల్లికి చదివించడం ఇష్టం ఉండేది కాదట. మరోవైపు ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాలపై చాలా ఇష్టం ఉండేదట. అలా కాస్త నటన నేర్చుకొని చిన్న చిన్న నాటకాలు వేస్తూ గొప్ప కళాకారుడిగా పేరు సంపాదించారు.

    కొడుకు నాటకాలు వేస్తుంటే తల్లి మురిసిపోయేదట. అలా ఓ నాటకాలు వేసే వ్యక్తికి తన కొడుకును అప్పజెప్పిందట కూడా. అలా నాటక రంగంలో కెరీర్ ను స్టార్ట్ చేసిన నాగేశ్వరరావు తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఓ నాటకం ద్వారా అర్థ రూపాయి సంపాదించి తల్లి చేతిలో పెడితే చాలా సంతోషించిందట. అయితే ఘంటసాల బాలరామయ్య అక్కినేనిని చూసి సినిమా అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ మద్రాసు పంపించడానికి తన తల్లి ఒప్పుకోలేదు. చెడు సావాసాలు చేస్తూ చెడిపోతాడేమో అని భావించి మేనత్త కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుందట.

    అదే విషయం నాగేశ్వరరావుకు చెప్పిందట తన తల్లి. అప్పటికే అతడికి 19 ఏళ్లు, మేనత్త కూతురు వయసు 15 సంవత్సరాలు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మేనమామకు ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదట. సినిమాలు అంటూ తిరిగే వాడితో తన కూతురుని ఇవ్వడం ఇష్టం లేదని అక్కినేని నాగేశ్వరరావు అమ్మతో కరాకండిగా చెప్పేశారట. అయితే ఏఎన్ఆర్ కూడా పెళ్లి చేసుకోను అని మద్రాసు వెళ్లి స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట. చెడు సావాసాలు చేయను అని మాట ఇవ్వడంతో తల్లి మద్రాసు పంపిందట. అలా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని తన కంటూ స్పెషల్ ముద్ర వేసుకొని ఇప్పటికీ కూడా తన పేరును మారుమోగేలా చేసుకున్నారు.