Old Movies: కాలం మారే కొద్దీ ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారే కొద్దీ మనిషి దృక్కోణం మారుతుంది. అప్పుడు ఇక మనిషి ఇష్టాలు కూడా మారతాయి. కానీ సినిమాల విషయానికి వస్తే.. నేటి తరం ప్రేక్షకులు కూడా పాత సినిమాలనే ఎందుకు ఇష్టపడుతున్నారు ? పైగా ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోల్చుతూ వాటిని క్లాసిక్స్ అంటున్నారు. ఎందుకు పాత సినిమాలు అంత గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి ? సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికంగా అద్భుతాలు చేసే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి.

అయినా పాత వాసన పైనే మమకారం ఎందుకు ? పాత సినిమాల్లో ఉన్నది ఏమిటి ? నేటి అధునాతన చిత్రాల్లో లేనిదే ఏమిటీ ? ఈ లెక్కలేవో ఏమి అర్ధం కాక సినిమా జనం పిచ్చి చూపులు చూస్తున్నారు. పాత సినిమాల్లో కథ బలంగా ఉంటుంది అని ఓ ముద్ర ఉంది. కానీ, మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి చిత్రాల్లోని కథలు కంటే.. నేటి తరం చిత్రాల్లోని కథలు ఇంకా బలంగా ఉంటాయి.
అయినా ఎందుకు పాత చిత్రాలనే అందరూ ఇష్టపడతారనేదే ఇక్కడ పాయింట్ !. ఈ కోణంలో ఆలోచిస్తే.. పాత చిత్రాల పై ఎక్కువ మక్కువకి కారణం.. అప్పటి వాస్తవ పరిస్థితులు, అప్పటి సరళమైన నేపథ్య దృశ్యాలే అని అర్ధం అవుతుంది. మనం ఏ పాత చిత్రం చూసినా.. ఆ చిత్రంలోని పరిస్థితులు మన పక్కింట్లో కూడా ఇలాంటివే ఉండేవి అనే భావన కలుగుతుంది.
పైగా రెండు మూడు ప్రధాన పాత్రలతోనే, ఎక్కడా విసుగు తెప్పించకుండా, కథ, కథనాలను నడిపేవారు. అందుకే, అప్పటి పాత సినిమాల్లోని పాత్రలు ప్రేక్షుకుల హృదయాల్లో బలంగా నాటుకుపోయాయి. ఇక నటన పై పూర్తి అవగాహన ఉన్న నటీనటులు పోటీపడి నటించేవారు. పైగా పాత్రలకు తగినట్లుగా తమ ఆహార్యాన్ని నూరుశాతం మార్చుకునే వారు.
Also Read: ఆహా లో సందడి చేసేందుకు సిద్దమైన “పుష్పక విమానం” సినిమా…
పాత సినిమాలు చూడటం మొదలు పెట్టిన అయిదు నిమిషాలలో మనం నటీనటులను మరిచిపోయి…ఆయా పాత్రలు మన ముందు సాక్షాత్కరిస్తాయి. అక్కడి నుంచి చివరి వరకు మనల్ని వాళ్ల కిటికీలోంచి తొంగిచూసేలా ఆ పాత్రలు ప్రవర్తన ఉంటుంది. ఇక మన జీవితాల్లో తారసపడే, సాధారణ దంపతుల్లా ఆ ముచ్చట్లు, చిరాకులు, ప్రేమలు, దెప్పి పొడుపులు.. పాత చిత్రాల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
అయితే, పైకి సూటిపోటి మాటలు అనుకున్నా ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కొనసాగుతుంది కథ. అన్నిటికీ మించి పాత చిత్రాల్లో సరసమైన సంభాషణలు, నాటకీయ దృశ్యాలు మనల్ని కట్టిపడేస్తాయి. అందుకే ఇప్పటికీ పాత చిత్రాలు గొప్ప చిత్రాలుగానే నిలిచిపోయాయి.
Also Read: పూర్ణ నటించిన “బ్యాక్ డోర్” చిత్ర రిలీజ్ వాయిదా… కారణం ఏంటంటే ?