Prabhas emotional moment: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సలార్ 2(Salaar 2), కల్కి 2 (Kalki 2) సినిమాలను సైతం చేసి తన దైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. అయితే ప్రభాస్ లాంటి నటుడు సైతం ఒక సందర్భంలో ఎమోషనల్ అయ్యాడు అనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ముఖ్యంగా ఆయన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈశ్వర్ (Eshwar) సినిమా ఫస్ట్ షాట్ షూట్ జరుగుతున్న క్రమంలో ఆయన ఫస్ట్ డైలాగ్ ఆ ఈశ్వరుడికి మూడు కండ్లు ఉంటే, ఈ ఈశ్వరుడికి మూడు గుండెలు ఉన్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రభాస్ వాళ్ల నాన్న ఎస్ అని ప్రభాస్ చేయని పైకెత్తరట…
ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అది చూసిన ప్రభాస్ అభిమానులందరు ప్రభాస్ కి వాళ్ళ నాన్నంటే అమితమైన ఇష్టమని ప్రస్తుతం ఆయన భూమ్మీద లేకపోయిన కూడా తనని గుర్తు చేసుకుంటాడని అభిమానులు ఆనందపడుతుంటారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ప్రేక్షకులను సైతం ఫిదా చేసే రేంజ్ లో సినిమాలను చేస్తూ పాన్ ఇండియా సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఇక మీదట కూడా అలాంటి సినిమాలు చేసి గొప్ప విజసులను అందుకోవాలని కోరుకుందాం…
Our Demigod #Prabhas Emotional Bond With His Father SuryaNarayana Raju Garu pic.twitter.com/er4I6rH0uV
— Roaring REBELS (@RoaringRebels_) November 15, 2022