Pawan Kalyan And Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. అలాగే అభిమానుల్లో కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుందంటే వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ లో దాదాపు నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. అలాగే ఇంకో నలుగురు చిన్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ గా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరోలలో చిరంజీవి ప్రముఖుడైతే, ఆయన తర్వాత పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ తన తర్వాత స్థానం లో ఉంటాడు…
ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా సక్సెస్ అయిన తర్వాత జానీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నప్పుడు సురేష్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకున్నాడు. చిరంజీవి కూడా సురేష్ కృష్ణతో సినిమా చేయమని పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఇక ఇలాంటి క్రమంలోనే సురేష్ కృష్ణ పవన్ కళ్యాణ్ కి ఒక కథ చెప్పాడు. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి ఓకే అనిపించినప్పటికీ ఒకసారి చిరంజీవికి చెప్పమని సురేష్ కృష్ణని చెప్పి పంపించాడు. తను వెళ్ళి చిరంజీవికి ఆ కథ వినిపిస్తే ఆయన మాత్రం ఈ కథతో పవన్ కళ్యాణ్ సినిమా చెయ్యడం వేస్ట్ అది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అంటూ చిరంజీవి ఆ డైరెక్టర్ తో చెప్పాడు.
ఇక దాంతో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి మాట మీద గౌరవంతో ఆ కథ కాకుండా వేరే కథతో సినిమా చూద్దామని సురేష్ కృష్ణ తో చెప్పాడు.ఇక అయన కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్లిపోయి ఈ స్టోరీ కి ఇంకో హీరో ని వెతికే పనిలో పడ్డాడు. అయితే ఇలాంటి క్రమంలోనే ఈశ్వర్ సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ప్రభాస్ సెకండ్ సినిమా కోసం ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నపుడు సురేష్ కృష్ణ ప్రభాస్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఆయన్ని కృష్ణంరాజు ని ఒప్పించి సినిమా చేశాడు ఆ సినిమానే రాఘవేంద్ర..
అయితే ఈ సినిమా ప్లాప్ అయింది. అయినప్పటికీ ఇందులో కొన్ని ఎలివేషన్స్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా చూసే ప్రభాస్ ని ఛత్రపతి సినిమా కోసం రాజమౌళి తీసుకున్నట్టుగా అప్పట్లో రాజమౌళి కూడా చెప్పాడు… ఇక మొత్తానికైతే చిరంజీవి తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని ఒక భారీ ప్లాప్ నుంచి తప్పించాడు. కానీ రాఘవేంద్ర సినిమా చేసి ప్రభాస్ మాత్రం ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు…