https://oktelugu.com/

Nara Rohit: ఆ స్టార్ హీరోయిన్ చెల్లిని పెళ్లి చేసుకోవాల్సిన నారా రోహిత్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నాడు..

సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్లే స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లతోనే సినిమా ఇండస్ట్రీ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 15, 2024 / 03:46 PM IST

    Nara Rohit

    Follow us on

    Nara Rohit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. మరి అలాంటి హీరోలందరు ఇప్పుడు తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నారా రోహిత్ కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. నిజానికి ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆయన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. బాణం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సోలో సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా అసుర, రౌడీ ఫెలో,ప్రతినిధి, జో అచ్యుతానంద లాంటి సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

    మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించిన సాధించకపోయిన నటుడిగా కూడా ఆయనకు మంచి పేరైతే వచ్చింది… ఇక చాలా రోజుల తర్వాత ఆయన చేసిన ‘ప్రతినిధి 2’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా చేసిన సిరి తో ఆయన గత కొద్ది రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడిపాడు.

    ఇక అందుకు తగ్గట్టుగానే నారా రోహిత్, సిరి వాళ్ళ ఇంట్లో పెద్దల కోరిక మేరకే వీళ్లిద్దరికి రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నారా రోహిత్ ఇంతకుముందు ఒక హీరోయిన్ తో డీప్ లవ్ లో ఉన్నాడని వాళ్ళిద్దరూ పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు అంటూ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…ఇంతకీ నారా రోహిత్ తో ప్రేమ వ్యవహారం నడిపిన హీరోయిన్ ఎవరా?అంటూ నెటిజన్లు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటే కాజల్ అగర్వాల్ చెల్లి అయిన నిషా అగర్వాల్ గా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సోలో అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ గాని బాండింగ్ గాని బాగా పెరిగిపోవడంతో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి.

    మరి ఏమైందో తెలియదు గానీ మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ఎవరికి వారు సపరేట్ అయిపోయారు. ఇంక నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని తన లైఫ్ లో సెటిలైపోయింది. ఇక ఇప్పుడు నారా రోహిత్ కూడా తన లైఫ్ ను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉండి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు… ఇక ఏది ఏమైనప్పటికీ రోహిత్ నిశ్చితార్థం సందర్భంగా తన గత ప్రేమ వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది….