Kamal Haasan: తెలుగు తమిళ్ భాషలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు కమలహాసన్…ఈయన చేసిన చాలా సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అయినప్పటికీ తను స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రెండు సంవత్సరాల క్రితమే ఆయన విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం కల్కి సినిమాలో విలన్ గా నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయాల్సిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని తన చేతులరా తనే మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది ఏ సినిమా అంటే కె విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘స్వర్ణకమలం’.. ఈ సినిమాని మొదట కమలహాసన్ తో చేయాలని కె విశ్వనాథ్ అనుకున్నారట. కానీ కమలహాసన్ ఆ సినిమాని రిజెక్ట్ చేయడంతో దానిని వెంకటేష్ తో చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.
అయితే ఈ సినిమా విషయంలో కమలహాసన్ చాలా రాంగ్ జడ్జిమెంట్ తీసుకున్నాడని కొంతమంది అంటుంటే, అది కమలహాసన్ ఇమేజ్ కి సరిపడా కథ కాదని మరికొంతమంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే కమలహాసన్ రిజెక్ట్ చేసిన కథతో వెంకటేష్ సూపర్ డూపర్ సక్సెస్ ని కొట్టడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అలాగే కె విశ్వనాథ్ కూడా ఒక ఆర్ట్ సినిమాలో వెంకటేష్ చాలా చక్కగా చూపించి ఆయనకి ఒక మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేశాడు.
ఇక మొత్తానికైతే ప్రస్తుతం కమలహాసన్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, వెంకటేష్ కూడా స్టార్ హీరోగా తన సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక మొత్తానికైతే ఇలాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచి పాత్రలను చేస్తూనే ఏ ఈగో లేకుండా హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తూ ఉంటాడు…