Homeఎంటర్టైన్మెంట్Khaidi Sequel: చరణ్ తో ఖైదీ సీక్వెల్ భారీగా ప్లాన్ చేసిన చిరంజీవి ఎందుకు ఆపేశాడు..?...

Khaidi Sequel: చరణ్ తో ఖైదీ సీక్వెల్ భారీగా ప్లాన్ చేసిన చిరంజీవి ఎందుకు ఆపేశాడు..? ఈ మేటర్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్

Khaidi Sequel: ఖైదీ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన మైలురాయి లాంటి చిత్రం. చిరంజీవికి తిరుగులేని స్టార్డం తెచ్చిపెట్టింది. ఖైదీ చిత్రానికి చిరంజీవి సీక్వెల్ ప్లాన్ చేశాడట. రామ్ చరణ్ తో తానే నిర్మాతగా రూపొందించాలని అనుకున్నాడట. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ చిరంజీవి పక్కన పెట్టేశారు. టైటిల్ కూడా ఫిక్స్ అయ్యాక చిరంజీవి ఖైదీ సీక్వెల్ ఎందుకు ఆపేశాడో చూద్దాం..

దశాబ్దాల పాటు చిరంజీవి తెలుగు సినిమాను తిరుగులేకుండా ఏలారు. నెంబర్ స్థానం కైవశం చేసుకున్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చి స్టార్ గా ఎదిగిన చిరంజీవి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ బరిలో దిగారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో రామ్ చరణ్ ఒకరిగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. నటన, డాన్సులలో చిరంజీవికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. 2007లో రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. పోకిరి తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి జగన్నాధ్ చేతిలో చరణ్ డెబ్యూ ప్రాజెక్ట్ పెట్టాడు చిరంజీవి.

చిరుత టైటిల్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మొదటి చిత్రంతోనే తానేమిటో రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. కాగా రామ్ చరణ్ రెండో చిత్రంగా ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేశాడట చిరంజీవి. నటుడిగా ఎదుగుతున్న క్రమంలో చిరంజీవి నటించిన ఖైదీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. చిరంజీవిని స్టార్ గా నిలబెట్టింది. 1983లో వచ్చిన ఖైదీకి సీక్వెల్ రామ్ చరణ్ హీరోగా చేయాలని చిరంజీవి భావించారు. ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో తానే నిర్మించాలని అనుకున్నారట. దాడి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.

అయితే చిరుత హిట్ కావడంతో రామ్ చరణ్ తో చిత్రాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో చిరంజీవి ఆలోచన మారిందట. కానీ చిరుత కు మించిన సినిమా పడాలని అనుకున్నారట. అందుకు రాజమౌళి సరైన దర్శకుడని ఆయన్ని సంప్రదించాడట. చిరంజీవికి రాజమౌళి మగధీర లైన్ వినిపించాడు. నచ్చడంతో డెవలప్ చేయమన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రెండో చిత్రంతోనే రామ్ చరణ్ వంద కోట్ల మార్క్ చేరుకున్నాడు. మగధీర తెలుగులో ఫస్ట్ 100 కోట్ల మూవీ కావడం విశేషం.

ఇక రామ్ చరణ్ కెరీర్ కి ఢోకా లేదు. ఆడియన్స్ అంగీకరించారని చిరంజీవి, ఖైదీ సీక్వెల్ ప్లాన్ అలానే వదిలేశాడు. మరి భవిష్యత్ లో అయినా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి చేస్తాడో లేదో చూడాలి.

Exit mobile version