https://oktelugu.com/

Drisham : ‘దృశ్యం’ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎంత హాట్ హీరోయిన్ గా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Drisham : ఒకప్పుడు బాలనటులుగా అలరించిన చిన్నారులు, ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లు గా మారి మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళు పెద్దయ్యాక చూసి మనం ఆశ్చర్యపోతుంటాము.

Written By: , Updated On : February 25, 2025 / 10:54 AM IST
Drisham

Drisham

Follow us on

Drisham : ఒకప్పుడు బాలనటులుగా అలరించిన చిన్నారులు, ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లు గా మారి మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళు పెద్దయ్యాక చూసి మనం ఆశ్చర్యపోతుంటాము. ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్దది అయిపోయిందా?, నిన్న గాక మొన్న చైల్డ్ ఆర్టిస్టుగా చూసినట్టు ఉందే అని అనుకుంటూ ఉంటాము. అలా ఈస్టర్ అనిల్ అనే అమ్మాయి కూడా ఇప్పుడు హీరోయిన్ గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఈస్టర్ అనిల్(Ester Anil) అనే అమ్మాయి విక్టరీ వెంకటేష్ హీరో(Victory Venkatesh) గా నటించిన దృశ్యం(Drushyam Movie||||||||||||) చిత్రం లో అతని చిన్న కూతురిగా నటించింది. ఈ సినిమాలో ఆమె సహజంగా నటించినందుకు ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దృశ్యం 2 లో కూడా ఈ చిన్నారి కనిపించింది. అంతకు ముందు కూడా ఈమె బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు హీరోయిన్ గా భారీ హిట్ కోసం ఎదురు చూస్తుంది.

ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. చిన్నప్పుడు ఎంతో అమాయకంగా, క్యూట్ గా కనిపించిన ఈ అమ్మాయి, ఈ రేంజ్ లో ఎదిగిపోయిందా?, ఇప్పుడున్న హీరోయిన్లు కూడా ఈమె ముందు పనికిరారు గా, ఇంత అందంగా ఉందేంటి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈమె హీరోయిన్ గా కూడా తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది కానీ, వాటికి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మాయి తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, రీల్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో త్వరలోనే ‘దృశ్యం 3’ (Drushyam 3 Movie) సెట్స్ మీదకు వెళ్లనుంది. అజయ్ దేవగన్, శ్రీయ శరన్ హీరో హీరోయిన్లు గా నటించబోతున్న ఈ సినిమాలో కూడా ఈస్టర్ అనిల్ నటించబోతుంది. ఒకవేళ తెలుగు లో కూడా దృశ్యం 3 తీస్తే ఇందులోనూ ఈస్టర్ అనిల్ నటించబోతుంది.

Drisham