Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడి చేసిందో ఎవరో తెలుసా..? ఎందుకు ఆయన్ని చంపాలనుకుంటున్నారంటే..?

1998 వ సంవత్సరంలో 'హం సాత్ సాలే హై ' అనే సినిమా షూటింగ్ లో భాగంగా సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఖాళీ సమయంలో ఆయనకి జంతువులను వేటాడటం అంటే చాలా ఇష్టం.

Written By: Gopi, Updated On : April 22, 2024 10:21 am

Bishnoi gang target Salman Khan

Follow us on

Salman Khan: ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. నిజానికి ఆయన ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ మన తెలుగు హీరోల ఎంట్రీ తో ఆయన క్రేజ్ అయితే కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే తెలుగు హీరోలు బాలీవుడ్ జనాలకి బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే అలా జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

1998 వ సంవత్సరంలో ‘హం సాత్ సాలే హై ‘ అనే సినిమా షూటింగ్ లో భాగంగా సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఖాళీ సమయంలో ఆయనకి జంతువులను వేటాడటం అంటే చాలా ఇష్టం. అందువల్లే దగ్గర్లో ఉన్న ఒక అడవిలోకి వెళ్లి అక్కడ ఒక కృష్ణ జింక ను కాల్చి చంపేశాడు.ఇవి అక్కడ రేర్ గా కనిపించే జింకలు కావడం వల్ల ఈయన మీద కేసు నమోదైంది. అప్పట్లో సల్మాన్ ఖాన్ మీద భారీగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇక మొత్తానికైతే కోర్టు ఆయనకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది.

ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ లోని బిష్టోయ్ అనే కమ్యూనిటీ మాత్రం సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు. ఇక అందులో భాగంగానే ఆయన్ని చంపడానికి కొంత మంది ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్పటినుంచి ఆయనకు సెక్యూరిటీని పెంచారు. అలాగే తను బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఎప్పుడు తన దగ్గర ఒక రివాల్వర్ ను పెట్టుకొని తిరుగుతున్నాడు.

ఇక బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు ఇప్పటికీ కూడా సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ఇంటి మీద మళ్ళీ దాడులు చేశారు… ఇక మొత్తానికైతే సల్మాన్ ఖాన్ చేసిన ఒక పని వల్ల ఆయన ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది…