Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన తీసిన అన్ని సినిమాలు తనకు గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో ఎక్కువగా మాస్ సినిమాలే ఉన్నాయి. ఆయన చేసిన మాస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రావడంతో ఆయన ఇప్పుడు కూడా మాస్ సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నాడు. ఇంతకు ముందు ఒకటి రెండు పౌరాణిక సినిమాలో నటించిన కూడా తన పూర్తి ఎజెండా బి,సి సెంటర్ ప్రేక్షకులే అని బాలయ్య గతంలో చాలాసార్లు తెలియజేశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘అఖండ 2’ సినిమాతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతున్న ఆయన ఇప్పుడు చారిత్రక నేపథ్యంలో సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైతం బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం విశేషం…ఇక బాలయ్య తన ఎంటైర్ కెరీర్ లో చాలా సినిమాలు మిస్ చేసుకున్నాడు. అందులో కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలైతే మరికొన్ని ఫెయిల్యూర్ సినిమాలు కావడం విశేషం…
రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కథ మొదట బాలయ్య బాబు దగ్గరికి వచ్చింది. కానీ బాలయ్య కి కథ పెద్దగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడు. గోపీచంద్ మలినేని రవితేజ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత బాలయ్య బాబుతో వీర సింహారెడ్డి సినిమా చేసి బాలయ్య ఖాతాలో ఒక సక్సెస్ ను కట్టబెట్టాడు. దాంతో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యంలో ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి బాలయ్య బాబు సిద్ధమవుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలోని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ‘అఖండ 2’ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
వరుసగా 4 విజయాలను అందుకున్న బాలయ్య దూకుడుకు అఖండ 2 బ్రేకులు వేసిందనే చెప్పాలి. ఇక మరోసారి ప్లాప్ అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…