Prabhas Vs Vijay: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సినిమాల మధ్య పోటీ అయితే ఉంటుంది. సంక్రాంతి కోడిపుంజుల మాదిరిగా హీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సంక్రాంతి పండగను క్యాష్ చేసుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు సైతం టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ అవుతోంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదే రోజు తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ చివరి చిత్రంగా వస్తున్న ‘జన నాయకుడు’ సైతం రిలీజ్ అవుతోంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ టాక్ ను సంపాదించుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. విజయ్ చేస్తున్న జన నాయకుడు సినిమా బాలయ్య బాబు చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని సైతం పండుగ సీజన్లోనే రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో చిత్ర నిర్మాతలైతే ఉన్నారు.
ఇక దిల్ రాజు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రభాస్ లాంటి స్టార్ హీరో కి పోటీగా అదే రోజు వస్తున్న విజయ్ ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాడు. తెలుగు ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రభాస్ మొదటిసారి హార్రర్ థ్రిల్లర్ సినిమాని చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది… ప్రభాస్ వరుసగా రెండు విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ సైతం తన చివరి సినిమాని సక్సెస్ ఫుల్ గా ముగించాలనే ఉద్దేశ్యంతో రీమేక్ సినిమాను చేశాడు. అయితే ఈ సినిమాకి తెలుగులో పెద్దగా ఆదరణ లభించకపోయిన కూడా తమిళ్ లో సక్సెస్ అవుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలైతే ఉన్నారు…