Balakrishna: స్కిల్ డెవలాప్ మెంట్ స్కామ్ కింద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ధర్నాలు, నిరసనలు, గొడవలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు లభిస్తుంది ? ముందులాగా పార్టీని ఎప్పుడు ముందుకు నడిపిస్తారు అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు విడుదలపై బెయిల్ పై ఎన్నో అనుమానాలు ఉండడంతో పార్టీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో టీడీపీలో నందమూరి బాలకృష్ణ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
ఎప్పుడు లేని విధంగా ఈ సారి బాలకృష్ణ అలర్ట్ గా ఉంటూ.. సీఎం జగన్ ను ఆయన పరిపాలనను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో యాక్టివ్ గా ఉంటారన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు బాలయ్య. సాధారణంగా బాలకృష్ణ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో మాత్రం యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. కానీ ఇతర సమయంలో మాత్రం రాజకీయాల్లో కంటే సినిమాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పటి వరకు కూడా బాలయ్య అదే కంటిన్యూ చేశారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో.. టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే బాధ్యతను బాలకృష్ణ తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయన కూడా రాష్ట్రమంతా పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం, ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చనే చర్చ జరుగుతుండటంతో బాలకృష్ణ ఇక సినిమాలకు కొన్ని నెలల పాటు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయ్యారనే చర్చ జరుగుతోంది.చంద్రబాబు ముందుండి నడిపించేందుకు సమయం పట్టేలా ఉండడం, ఆయన బెయిల్ పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పార్టీ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. పార్టీని నడిపించే పూర్తి సామర్థ్యం నారా లోకేష్ లేదనే టాక్ కూడా ఉండడంతో పార్టీ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు అని కొందరి టాక్.
ప్రస్తుతం బాలయ్య నటించిన భగవంత్ కేసరీ సినిమా అక్టోబర్ లో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఎన్నికల వరకు రాజకీయాల్లోనే ఫోకస్ చేయాలని చూస్తున్నారట. ఇక టీడీపీలోని పరిస్థితులు కూడా బాలకృష్ణను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి అంటున్నారు కొందరు.