బిగ్‌బాస్‌లో ఎవరూ ఊహించని విధంగా మూడో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం అందరూ కుమార్ సాయి ఎలిమినేట్ అవుతారని లెక్కలు వేసుకున్నారు. కానీ.. ఒక్కసారిగా దేవీ నాగవల్లి హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి షాక్ తిన్నారు.
బిగ్‌బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్‌లో భాగంగా గత సోమవారం ఏడుగురు నామినేట్ అయ్యారు. ‘అమ్మా రాజశేఖర్’ మాస్టర్ తో దేవి గొడవపడి.. ఆయనను అవమానించి ఆయన ఏడ్చేలా చేసినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. ఆ ఎపిసోడ్ తో దేవి వ్యవహారశైలిపై ప్రేక్షకుల్లో ఇంటిసభ్యుల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో గత వారం జరిగిన ఈ పరిణామం ఈ వారం దేవి ఎలిమినేట్ కారణమైంది.
దేవి ఎలిమేనషన్‌తో ఆరియానా ఎమోషన్‌ను తట్టుకోలేకపోయింది. బిగ్గరగా ఏడ్చేసింది. తను అక్కలాగా భావించే దేవి వెళ్లిపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు చెప్పింది.
అయితే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి స్టేజ్‌పైకి వచ్చిన దేవీ నాగవల్లీ అందరి పట్ల పాజటివ్‌గానే స్పందించింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఫేక్ గేమ్ ఆడలేరని చెప్పిన దేవి.. ఒక్కో కంటెస్టెంట్ గురించి పాజిటివ్ యాంగిల్‌లోనే మాట్లాడింది. ఎవరెవరు ఎలా ఉండాలో వారికే ప్రత్యేకంగా చెప్పింది. చివరకు బిగ్‌బాంబ్‌ను ఎవరిపై వేస్తావు అని నాగ్ అడిగితే.. తనకు పాజిటివ్ బిగ్‌బాంబ్ కావాలని రిక్వెస్ట్ చేసింది. వచ్చే వారం నామినేషన్స్ నుంచి అరియానాను సేవ్ చేసింది. తన ఎలిమినేషన్‌కు కారణమేంటో తెలియలేదని, చెప్పిన దేవి.. చివరగా ‘ఐ’ సినిమాలోని పాట పాడి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
Comments are closed.