Gang Leader: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు, సాధించిన విజయాలు, అందుకున్న రికార్డులు, ఆయన గెలుపొందిన అవార్డులని చూస్తేనే మెగాస్టార్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవెల్లోకి తీసుకెళ్లిన ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి.
ఇక అప్పట్లో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు, బప్పిలహరి ఇచ్చిన మ్యూజిక్ ఇవన్నీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘వాన వాన’ సాంగ్ ని రామ్ చరణ్ రచ్చ సినిమాలో రీమిక్స్ చేసి హిట్ కొట్టడం తో మరోసారి ఆ సాంగ్ లో ఉన్న పవర్ ఏంటో యావత్తు తెలుగు సినిమా అభిమానులకు తెలిసింది. ఇక చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడంలో ఈ సినిమా చాలావరకు హెల్ప్ చేసిందనే చెప్పాలి. అయితే ఇలాంటి ఒక సూపర్ హిట్ సినిమాను మొదట్లో చిరంజీవి నేను చేయను అని చెప్పాడట…
అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఇక అప్పటికే చిరంజీవితో పలు సినిమాలు తీసి విజయాలను అందుకున్న డైరెక్టర్ విజయ బాపినీడు, ఈసారి చిరు కి ఒక భారీ సక్సెస్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఆయనకి ‘గ్యాంగ్ లీడర్ ‘ కథ చెబితే ఆ స్టోరీ మొత్తం విన్నాక చిరంజీవి ఈ సినిమా నేను చేయను. ఇది ఫ్లాప్ అవుతుంది అని చెప్పాడట, దాంతో విజయ బాపినీడు ఈ సినిమా చిరంజీవి తప్పితే వేరే ఏ హీరో చేసిన ఆడదు అనే ఉద్దేశ్యం తో చిరంజీవిని ఎలాగైనా ఒప్పించాలి అని పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లి ఈ కథని చెప్పారట. దాంతో వాళ్లు కూడా ఆ కథ విని ఇందులో చాలా మార్పులు చేర్పులు చేయాలి, అప్పుడైతేనే ఈ కథ చిరంజీవికి సెట్ అవుతుంది అని విజయ బాపినీడు కి చెబితే ఆయన సరే అని ఒప్పుకున్నాడు.
దాంతో పరుచూరి వాళ్ళు మూడు రోజుల్లో మొత్తం స్టోరీ ని మార్పులు చేర్పులు చేశారు. ఇక పరుచూరి వాళ్లే ఆ కథని చిరంజీవికి చెబితే అప్పుడు ఆ కథ నచ్చి చిరంజీవి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అప్పుడు చిరంజీవి డేట్స్ మొత్తం అల్లు అరవింద్ చూసుకునేవాడు కాబట్టి అల్లు అరవింద్ కి కూడా పరుచూరి బ్రదర్స్ ఒకసారి స్టోరీని వినిపించారు. దాంతో అల్లు అరవింద్ ఆ కథ విని ఫైనల్ చేయడంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా,ఇప్పటికీ కూడా కమర్షియల్ సినిమాలకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ సినిమాని చెబుతూ ఉంటారు…