Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉంటే ఈజీగా ఎదగచ్చు అని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవ్వడానికి మాత్రమే బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ అనేది పనిచేస్తుంది తప్ప ఇక్కడ హీరోగా నిలబడడానికి మాత్రం బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ అనేది అసలు పని చేయదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలామంది పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరోలను చూశాం.
వాళ్లలో టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడ్డారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయారు. కాబట్టి ఇలాంటి క్రమంలో ఇక్కడ టాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది అనేది ఎప్పటికప్పుడూ ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం నాగచైతన్యకి ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి, అటు రామానాయుడు ఫ్యామిలీ నుంచి భారీ సపోర్ట్ అయితే దక్కింది. దాంతోనే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. జోష్ సినిమాతో ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా తో ఆయన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు లవర్ బాయ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు. కొన్ని సినిమాలతో సక్సెస్ అవుతున్నాడు. కానీ భారీ సక్సెస్ లను మాత్రం కొట్టలేకపోతున్నాడు. రెండు పెద్ద ఫ్యామిలీ ల సపోర్ట్ ఉన్నప్పటికీ తను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు అంటూ పలువురు నాగచైతన్య పైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య ను పట్టించుకోవడం లేదు అంటూ మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు. రామానాయుడు బిడ్డ అయిన లక్ష్మి కొడుకే నాగచైతన్య. వెంకటేష్ కి సురేష్ బాబు కి మేనల్లుడు అవుతాడు. అయినప్పటికీ వీళ్లు నాగచైతన్య కెరీర్ ని గాడిలో పెట్టడానికి ట్రై చేస్తే బాగుండేది అంటూ పలువురు సినీ విమర్శకులు సైతం వెంకటేష్ ని సురేష్ బాబుని విమర్శిస్తున్నారు.
ఇంకా నాగచైతన్య కెరియర్ మొత్తాన్ని నాగార్జున నే చూసుకుంటున్నాడు. అయినప్పటికీ సక్సెస్ లు మాత్రం పెద్దగా సాధించలేకపోతున్నాడు. దీన్ని బట్టి ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ కంటే కూడా సక్సెస్ లు ఉంటేనే ఇక్కడ స్టార్ హీరోగా ఎదుగుతారు అనేది మాత్రం పక్కాగా తెలిసిపోతుంది…