Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం ఒక ప్రాంక్ వీడియో చేసింది. కానీ.. ఈ వీడియో మిస్ ఫైర్ అయ్యింది. ఐతే ఈ వీడియో పై ఓ ప్రముఖ ఛానెల్ లో చర్చ జరిగింది. ఆ చర్చకు విశ్వక్ సేన్ కూడా హాజరు అయ్యాడు. ఐతే, ఈ చర్చలో ఆవేశాలు పెరిగి, విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ దేవి నాగవల్లి ‘గెట్ అవుట్’ అంటూ గట్టిగా అరిచి చెప్పింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

పైగా దేవి నాగవల్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విశ్వక్ పై చర్యలు తీసుకోమని కోరింది. ఆమె తిట్టి మళ్ళీ ఆమె చర్యలు తీసుకోమని కోరడం నిజంగా దారుణమే. దీనికితోడు మహిళల సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. విశ్వక్ పై విమర్శలు చేసాయి. అలాగే జర్నలిస్ట్ సంఘాలు కూడా దేవికి మద్దతుగా నిలబడ్డాయి.
Also Read:Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
మొత్తానికి దేవి నాగవల్లికి మద్దతుగా చాలా సంఘాలు ముందుకు రావడం చకచకా జరిగిపోయాయి. కానీ.. ఇటు విశ్వక్ కు మాత్రం ఎవ్వరూ మద్దతు ప్రకటించకపోవడం విశేషం. అసలు సినిమా పరిశ్రమ నుంచి కూడా విశ్వక్ కు ఆశించినంత స్థాయిలో మద్దతు రాకపోవడం నిజంగా దారుణమే.

సినిమా వాళ్ళు కూడా సినిమా వాడికి సపోర్ట్ చేయకపోతే ఎలా ? విశ్వక్ ఒక మహిళలు పట్ల మాట్లాడిన మాటలు తప్పే కావొచ్చు, మరి సదరు జర్నలిస్ట్ చేసింది ఏమిటి ? ఆమె కూడా వ్యక్తిగతంగా విశ్వక్ ను దారుణంగా అవమానించింది కదా. అసలు దేవి నాగవల్లి విషయం పూర్తిగా తెలుసుకోకుండా విశ్వక్ ను డి గ్రేడ్ చేస్తూ డిబేట్ పెట్టింది.
ఇది ఎంత తప్పు. అయినా సినిమా పరిశ్రమ నుంచి విశ్వక్ కు ఎందుకు మద్దతు లభించలేదు ? సినిమా పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ విషయంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. కనీసం ఈ ఇష్యూ ని ఇక్కడితో ఆపడానికి కూడా సినిమా పెద్దలు ఎందుకు ప్రయత్నించలేదు.
Also Read: TV9 vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ టీవీ9.. ట్రోలింగ్ వీడియోలతో పండుగ చేసుకుంటున్న నెటిజన్లు
Recommended Videos:
[…] […]
[…] […]