Ram Charan Anil Ravipudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపే దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నేపించినవే కావడం విశేషం… 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో యావత్ తెలుగు ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి ఈ సినిమా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు మెగా అభిమానులు రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ అరిచారు. దాంతో అనిల్ ఈ సినిమాని సక్సెస్ చేయండి. అప్పుడు రామ్ చరణ్ తో ఒక పెద్ద సినిమా చేస్తాను అంటూ అనిల్ రావిపూడి సమాధానం ఇచ్చాడు. ఇక దాంతో సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
ఒకవేళ అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో సినిమా చేస్తే అది కూడా క్రింజ్ కామెడీతో ఉంటుందని రామ్ చరణ్ అనిల్ రావిపూడి తో సినిమా చేయకపోవడమే బెటరని మరికొంత మంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి గత కొన్ని రోజుల నుంచి అనిల్ రావిపూడి మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాలన్నీ ఎప్పుడు రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగుతూ ఉంటాయని అందువల్ల అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడం వల్ల హీరోలకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని కేవలం అతని సినిమాలు పండక్కి వస్తాయి కాబట్టి సక్సెస్ అవుతాయి. ఇతర సమయాల్లో వచ్చినప్పుడు అతని సినిమాలను పట్టించుకునే వారు ఉండరని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక పండక్కి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలను చూసి ఆదరిస్తారు. కాబట్టి అతను పండుగ సీజన్లను మాత్రమే నమ్ముకుంటాడని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… మొత్తానికైతే అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో సినిమా చేయకపోతేనే బెటర్ అని చాలామంది మెగా అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు…