Homeఆంధ్రప్రదేశ్‌Polavaram Latest drone footage: అద్భుతం.. పోలవరం.. లేటెస్ట్‌ డ్రోన్‌ దృశ్యం చూసి తీరాల్సిందే!

Polavaram Latest drone footage: అద్భుతం.. పోలవరం.. లేటెస్ట్‌ డ్రోన్‌ దృశ్యం చూసి తీరాల్సిందే!

Polavaram Latest drone footage: పోలవరం ఆంధ్రప్రదేశ్‌ రైతులు, ప్రజల దశాబ్దాల కల. వృతాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు తలపెట్టిన ప్రాజెక్టు ఇది. ఏపీ జీవనాడిగా నిలిచే జాతీయ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజా డ్రోన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యాలు ప్రాజెక్టు పురోగతిని, భవిష్యత్‌ ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ప్రాజెక్టు పురోగతి..
లేటెస్ట్‌ డ్రోన్‌ షాట్‌లు ప్రధాన డ్యామ్, స్పిల్‌వేలు, కాలువల నిర్మాణాన్ని ప్రదర్శిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో 6.11% పనులు పూర్తి చేసింది. భూసేకరణలో 3.80%, పునరావాసంలో 2.56% పురోగతి కనిపిస్తోంది. డ్రోన్‌ వీడియోల్లో కాఫర్‌ డ్యామ్, డయాఫ్రామ్‌ వాల్స్‌ మెరుగుపడిన రూపం కనిపిస్తుంది.

ప్రాజెక్టు విశేషాలు..
పోలవరం గోదావరిపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీళ్లు అందిస్తుంది. 814 మిలియన్‌ క్యూసెక్స్‌ నీటి నిల్వ సామర్థ్యం, విద్యుత్‌ ఉత్పత్తి, జలరవాణాలు, చేపల పెంపకం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం ఖర్చు రూ.62,436 కోట్లుగా అంచనా.

నిర్మాణంలో వేగం..
గత 5 ఏళ్లలో 11.58% మాత్రమే పనులు జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో సగంపైగా పూర్తి చేసింది. కేంద్రం రూ.23,658 కోట్లు ఇచ్చి మొత్తం రూ.30,436 కోట్లకు ఇంకా రూ.6,645 కోట్లు ఇవ్వాలి. అడ్వాన్స్‌ నిధులతో పనులు వేగవంతమవుతున్నాయి.

డ్రోన్‌ దృశ్యాలు ప్రాజెక్టు వేగాన్ని చూపిస్తున్నాయి. అయితే పునరావాసం, భూసేకరణ సవాళ్లు ఇంకా ఉన్నాయి. తెలంగాణ పోలవరం–నల్లమలసాగర్‌ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తి అయితే రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ మార్పు తీసుకొస్తుంది. డెడ్‌లైన్‌లు కట్టుబడి పనులు చేస్తే 2027 నాటికి పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular