Sandeep Reddy Vanga Reaction: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆ సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ 950 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ మీద బాలీవుడ్ మాఫియా నెగెటివ్ ప్రచారం చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ వాళ్ళందరికి సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తన సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ మాఫియాకి ఇప్పటి వరకు ధమ్కీ ఇచ్చిన దర్శకుడు ఎవ్వరు లేరు. కానీ సందీప్ వంగ మాత్రం బాలీవుడ్ మాఫియాకి చెమటలు పట్టించాడు. ఇక సందీప్ ను తొక్కలని చూసినప్పటికి అది సాధ్యం కాలేదు. దాంతో ఎలాగైనా సరే ఇప్పుడు అతనితో సినిమా చేయాలని అతన్ని రాజీ పరచాలని ప్రయత్నం చేస్తున్నారట.
ఇక అందులో భాగంగానే అమీర్ ఖాన్ సైతం సందీప్ రెడ్డి వంగతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ సందీప్ మాత్రం అమీర్ ఖాన్ ను పట్టించుకోవడం లేదట. కారణం ఏంటి అంటే తన సినిమాల మీద నెగెటివిటీని పెంచే ప్రయత్నం చేసిన వాళ్లు ఇప్పుడు తను సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి తనతో సినిమాలు చేయాలనుకుంటున్నారు.
అదే వాళ్ళ మాఫియా బరిలో చిక్కుకొని సినిమాలు ఆడకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది అని సందీప్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే బాలీవుడ్ ఖాన్స్ తో తను సినిమాలు చేయబోయే ప్రసక్తే లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను చేస్తున్న సందీప్ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం మీద సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమా పూర్తి అయిన తర్వాత తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…