Liger: ఓ టూ టైర్ హీరో సినిమాకు వంద కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం పోతుంది. లైగర్ విషయంలో అదే జరిగిందన్న మాట వినిపిస్తోంది. బయ్యర్లను ఈ మూవీ నిండా ముంచేయడం ఖాయంగా కనిపిస్తుంది. డిజాస్టర్ టాక్ తో రెండో రోజే లైగర్ వసూళ్లు పడిపోయాయి. హిందీలో 70 శాతం షోస్ ఆడియన్స్ లేక క్యాన్సిల్ అయ్యాయని వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఆయన చెప్పినంత దారుణంగా పరిస్థితి ఉందో లేదో తెలియదు కానీ… డామేజ్ గట్టిగానే జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులను రూ. 67 కోట్లకు వరంగల్ శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం. అసలు విజయ్ దేవరకొండ మార్కెట్ గురించి ఆలోచించకుండా రికార్డు ధరకు లైగర్ హక్కులను దక్కించుకున్నారు. రెస్పాప్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ. 85 నుండి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే కనీసం రూ. 120 కోట్ల వరకు రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే లైగర్ తో వంద కోట్ల నష్టం జరగవచ్చు. ఈ మొత్తాన్ని ఎవరు భరిస్తారనేది అసలు సమస్య.
Also Read: Highest Paid Actors: ఈ అగ్ర హీరోల ఒక రోజు సంపాదన ఎంతో తెలిస్తే అవాక్కే
లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండ రూ. 20 నుండి 25 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంతకు ముందు ఆయన రెమ్యూనరేషన్ రూ. 10 లోపే. కాబట్టి ఆయన ఎంతో కొంత తిరిగిచ్చే అవకాశం కలదు. నిర్మాతలు పూరి, ఛార్మి నిండా ముగినట్లే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ బంపర్ హిట్ కొడితేనే వాళ్లకు లాభాలు. ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా ఫ్యాన్సీ ధర చెల్లించవు. ఏవిధంగా చూసినా లైగర్ రూపంలో మరో ఆచార్య పడినట్లే. ఆచార్య చిత్రాన్ని కూడా వరంగల్ శ్రీను కొన్నారు. కానీ ఆర్థిక విషయాల్లో తలదూర్చి దర్శకుడు కొరటాల శివ బుక్ అయ్యాడు. ఏళ్లుగా సంపాదించినది ఒక్క సినిమాతో పోగొట్టుకున్నాడు.

లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పూరి మీద కోపంగా ఉన్నారట. ఆయన ఇకపై ఏమాత్రం ఆదుకునే పరిస్థితి లేదు. ఏది ఏమైనా ఏదో హైప్ క్రియేట్ చేసి, ఓ హీరో మార్కెట్ కి మించి భారీ చిత్రాలు చేయడం సరికాదని రుజువైంది.
Also Read: Posani Krishna Murali: నువ్వే నా భార్య.. సీరియల్ నటికి షాకిచ్చిన పోసాని?

