Bollywood Star Heroes: ప్రశాంత్ నీల్, సందీప్ వంగ వెంట పడుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరంటే..?

ఆలోపు అమీర్ ఖాన్ తో కాదు కదా వేరే ఎవరితో కూడా సినిమా చేసే పరిస్థితిలో తను లేడు కాబట్టి ఇదే విషయాన్ని అమీర్ ఖాన్ తో ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : December 26, 2023 5:07 pm
Follow us on

Bollywood Star Heroes: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీల్ పేర్లు చాలా భారీ రేంజ్ లో వినిపిస్తున్నాయి.ఇక వీళ్లిద్దరూ డిసెంబర్ నెలలో భారీ సక్సెస్ లను సాధించారు. అందువల్లే వీళ్ళ తో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా స్టార్లు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్లు అయితే ఏకం గా వీళ్ళ మీద ఒక కన్నేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అమీర్ ఖాన్ లాంటి సూపర్ హీరో ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మాట్లాడి అతనితో ఒక సబ్జెక్ట్ మనం చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కి చాలా కమిట్ మెంట్లు. ఇవన్నీ క్లియర్ అయి ఆయన ఫ్రీ అవ్వాలంటే ఈజీగా ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది.

ఆలోపు అమీర్ ఖాన్ తో కాదు కదా వేరే ఎవరితో కూడా సినిమా చేసే పరిస్థితిలో తను లేడు కాబట్టి ఇదే విషయాన్ని అమీర్ ఖాన్ తో ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ప్లాన్ చేద్దాం సార్ ప్రస్తుతానికి అయితే నేను చాలా బిజీ అంటూ ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియాలో ప్రత్యేక కథనాలు అయితే వస్తున్నాయి… ఇప్పుడు సలార్ సినిమా ప్రశాంత్ నీల్ ని మరొక మెట్టు పైకి ఎక్కించింది.

ఇక ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక డార్క్ మూడ్ లో ఉంటూనే ఎలివేషన్ ఎమోషన్స్ తో పిచ్చెక్కించగలిగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని ఆ రేంజ్ లో చూపించాడు…ఇక ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ వెంట కూడా చాలామంది హీరోలు పడుతున్నారు. అందులో భాగంగానే హృతిక్ రోషన్ లాంటి ఒక స్టార్ హీరో కూడా సందీప్ రెడ్డి వంగ ని కన్సల్ట్ అయినట్టుగా తెలుస్తుంది.

మనిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా చేద్దామని చెప్పాడు. కానీ సందీప్ కూడా ప్రస్తుతం ఖాళీ లేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి బాలీవుడ్ హీరోలు మన సౌత్ డైరెక్టర్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ మన డైరెక్టర్లు మాత్రం ప్రస్తుతం ఉన్న బీజీకి బాలీవుడ్ స్టార్ హీరోలను పట్టించుకునే పరిస్థితిలో లేరు…ఇక బాలీవుడ్ హీరోలని ఇలానే చేయాలి వాళ్ళతో మన డైరెక్టర్లు ఒక్క సినిమా కూడా చేయకూడదు అంటూ మన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు…