Bigg Boss Non-Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మొదట్లో కాస్త చప్పగా సాగినా.. ఆ తరువాత రంజుగా మారింది. ఈ హౌజ్ లో మిగతా వారి కంటే బిందు మాధవి, అఖిల్ సార్థక్ లు పోటా పోటీగా తలపడుతుండడంతో 4వ వారం నుంచే బిగ్ బాస్ రక్తికడుతోంది. అఖిల్ సార్థక్ గత బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచారు. అప్పుడు అభిజిత్ తో పోరాడిన ఇతడు ఇప్పుడు బిందుమాధవితో యుద్ధం చేయాల్సి వస్తోంది. నిత్యం ఏదో ఒక కారణంతో వీరిద్దరు గొడవపడుతున్నారు. దీంతో షోలో వీరే హైలెట్ అయ్యారు. అయితే ముందు ముందు ఎవరు విన్నవుతారోనన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

ప్రముఖ హీరోయిన్ బిందుమాధవి, అఖిల్ కు టఫ్ ఫైట్ ఇస్తోంది. అఖిల్ ఎమోషన్స్ ను సరైన టైంలో వాడుకుంటోంది. దీంతో అఖిల్ కంటే బిందుమాధవి ఒక మెట్టు పైనే ఉంది. అఖిల్ మాత్రం కాస్త బరెస్ట్ కావడంతో పాజిటివ్ పాయింట్స్ తగ్గిపోతున్నాయి. బిగ్ బాస్ లో జెన్యూన్ గా ఆడుతుండడంతో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో బిందు మాధవి సక్సెస్ అయ్యింది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. అఖిల్ తో కావాలనే గొడవలు పెట్టుకోవడం.. ఆ తరువాత ఆయనకు కోపం తెప్పించే లాంటి పనులు బిందు మాధవి చేస్తోంది. అయితే పాయింట్ ఉన్నా లేకున్నా గేమ్ ను స్ట్రాటజీగానే ప్లే చేస్తోంది.
Also Read: Sai Pallavi: ఆ రెండు బాగా ఇష్టం అంటున్న ‘సాయి పల్లవి’
టైటిల్ ఫేవరేట్ అఖిల్ కూడా కొన్ని సందర్బాల్లో బిందుమాధవి ఎత్తులకు తట్టుకోలేక బరెస్ట్ అవుతున్నారు. కాస్త రియాక్షన్ ఎక్కువ కావడంతో ఆయనకు పాయింట్స్ తగ్గుతున్నాయి. కానీ చాలా వరకు అఖిల్… బిందుమాధవి రెచ్చగొడుతున్నా పట్టించుకోవడం లేదు. తన టాస్క్ లను పూర్తి చేస్తున్నాడు. బిందుమాధవి అతనిని టార్గెట్ చేసినా తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ వీరిద్దరి మధ్య మొదటి నుంచి అనఫిషియల్ పోలింగ్ సైట్స్ లో ఓటింగ్ శాతం బాగానే పెరుగుతోంది. అయితే బిందుమాధవి అఖిల్ కు పోటీగా మారడంతోనే ఆమెకు క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.

మొత్తంగా రేస్ లో ఎవరూ విన్నర్ అవుతారన్న ఆసక్తి నెలకొంది. ఓటీటీ ఫ్లాట్ ఫాం పై బిగ్ బాస్ ను మొదట్లో ఎవరూ పట్టించుకోకపోయినా బిందుమాధవి, అఖిల్ ఫర్ఫమెన్స్ తో కాస్త జోష్ పెరిగింది. హౌస్ మొత్తం వీరినే టార్గెట్ చేయడం వారికి కలిసొచ్చింది. ఇక చివరి దశకు వస్తున్న నేపథ్యంలో వీరి మధ్య ఫైట్ మరింత ఎక్కువవుతోంది. కానీ మొత్తంగా బిందుమాధవి విన్నవుతారా..? లేక అఖిల్ టైటిల్ కొట్టేస్తాడా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో బిందుమాధవి కాస్త ఎక్కువగా ప్రవర్తించడంతో మైనస్ అయ్యింది. ఆమె ఓటింగ్ తగ్గి అఖిల్ కు పెరిగింది. ఇప్పటికే రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రతి మూమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టాప్ ప్లేసులోనే కొనసాగుతోంది బిందుమాధవి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే బిందుమాధవే ఈసారి టైటిల్ కొట్టేలా ఉంది. కానీ లాస్ట్ వరకూ ఏం జరుగుతుందన్నది చెప్పలేం.
Also Read:Bigg Boss Akhil And Bindu Madhavi: అఖిల్ కోసం ‘చేయి కోసుకుంటా’.. అందరికీ షాకిచ్చిన బిందుమాధవి