https://oktelugu.com/

హిటెక్కుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్.. టాప్-5లో ఉండేది వీరేనా? 

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్-4 ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య పోటీతత్వం పెరిగి గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి మరొకరు బయటికి వెళ్లనున్నారు. దీంతో ఎవరా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. Also Read: అల్లు అర్జున్ కూతురు అర్హ.. వీడియో చేసింది అతడేనా? బిగ్ బాస్-4 […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 11:59 AM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్-4 ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య పోటీతత్వం పెరిగి గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి మరొకరు బయటికి వెళ్లనున్నారు. దీంతో ఎవరా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

    Also Read: అల్లు అర్జున్ కూతురు అర్హ.. వీడియో చేసింది అతడేనా?

    బిగ్ బాస్-4 ప్రస్తుతం 11వ వారంలో కొనసాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో అభిజిత్.. అరియానా.. మోనాల్ గజ్జర్.. దేత్తడి హారిక.. లాస్య ఉన్నారు. వీరిలో నుంచి శనివారమే సొహైల్ సేవ్ అయ్యాడు. దీంతో మిగతా వారిలో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ పరంగా చూస్తే చివరి మూడుస్థానాల్లో మోనాల్, లాస్య, అరియానాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ వారం ఎలిమినేషన్ పై ముందు నుంచి బిగ్ బాస్ నుంచి లీకులు వస్తున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది యాంకర్ లాస్యనే అని ప్రచారం జరుగుతోంది. ఈ వారం కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే లాస్య సైతం తాను ఇంటికి వచ్చేస్తానంటూ తన భర్తతో వాపోయింది. ఎవరైతే హౌస్ లో గొడవలు పెట్టుకోకుండా ఉంటారో వారిని బిగ్ బాస్ టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఈ వారం లాస్య ఎలిమినేట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: హిటెక్కుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్.. టాప్-5లో ఉండేది వీరేనా?

    బిగ్ బాస్-4 చివరి అంకానికి చేరుతుండటంతో టాప్-5లో ఉండే కంటెస్టెంట్లపై చర్చ నడుస్తుంది. ఇందులో ముందుగా అభిజిత్.. అఖిల్.. సొహైల్ పేర్లు విన్పిస్తున్నారు. వీరు ముగ్గురితోపాటు అరియానా.. మొనాల్ గజ్జర్.. దేత్తడి హరికలు టాప్-5లో ఉండొచ్చనే టాక్ విన్పిస్తోంది.

    అనివాష్ కు బయట వారే కాంట్రాక్టులు ఉండటంతో అతడు టాప్-5లో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక బిగ్ బాస్ విన్నర్ అభిజితే అని అతడి ఫ్యాన్స్ ముందుస్తు ప్రచారం షూరు చేస్తుండటంతో అతడిపేరు ట్రెండింగులో దూసుకెళుతోంది. వచ్చే నెల 20న బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు నిర్వహాకులు సన్నహాలు చేస్తున్నారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్