Ram Pothineni: ‘ఎనర్జిటిక్ స్టార్’ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని… ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చాలా మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలేవి అతనికి పెద్దగా కలిసి రాలేదు. దాంతో చాలా సంవత్సరాల పాటు ఆయనకి వరుసగా ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి. రీసెంట్ టైంలో కూడా ఆయన సరైన సక్సెస్ ని సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో రామ్ పోతినేని స్టార్టింగ్ లో తనకొక ట్యాగ్ ఉండేదని దానిని రెండు, మూడు సినిమాలకు కంటిన్యూ చేసిన తర్వాత ఆ ట్యాగ్ ను మరొక హీరో వాడుకున్నాడని ఆ హీరో పేరు నేను చెప్పను అంటూ రామ్ చెప్పడం విశేషం… ఇక ఇదంతా చూసిన చాలామంది అల్లు అర్జున్ వాడుకుంటున్న స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ను మొదట్లో రామ్ వాడాడని, మొత్తానికైతే అల్లు అర్జున్ రామ్ నుంచి లాక్కున్నాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదంత చూసిన మరికొంతమంది మాత్రం 2006 దేవదాసు సినిమా వచ్చింది. రామ్ మొదటి సినిమా ఇదే కావడం విశేషం…కానీ అంతకంటే ముందే అల్లు అర్జున్ 2005వ సంవత్సరంలోనే బన్నీ సినిమా చేశాడు. ఈ సినిమాకోసం మొదటి సారి అల్లు అర్జున్ ‘స్టైలిష్ స్టార్’ అనే ట్యాగ్ ను వేసుకున్నాడు. అంటే రామ్ కంటే ముందే ఆ ట్యాగ్ ను అల్లు అర్జున్ వాడుకున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ ని ట్రోల్ చేసే వాళ్లకు అతని అభిమానులు తనని ట్రోల్ చేయవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి రామ్ స్టార్టింగ్ లో ‘రాకింగ్ స్టార్’ అనే ట్యాగ్ వేసుకున్నాడు. ఇక దాన్ని ఆ తర్వాత కాలంలో మంచు మనోజ్ వాడుకున్నాడు… ఇప్పుడు చాలామంది మంచు మనోజే రామ్ ట్యాగ్ ను కాపీ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి దీని మీద ఇంకెవరైనా స్పందిస్తారా అలాగే దీనిమీద సరైన క్లారిటీ వస్తుందా? లేదా అనేది…