https://oktelugu.com/

Bhanupriya: డైరెక్టర్ వంశీ భానుప్రియ పెళ్లి కి అడ్డుచెప్పింది ఎవరో తెలుసా..?

హీరో పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి అనే భావన నుంచి హీరోయిన్ కూడా మొదటినుంచి చివరి వరకు సినిమాలో ఉంటుంది. కాబట్టి తన పాత్ర కి కూడా ప్రాధాన్యత ఉండాలి.

Written By:
  • Gopi
  • , Updated On : March 19, 2024 / 03:03 PM IST

    Who obstructed director Vamsi Bhanupriya wedding

    Follow us on

    Bhanupriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు వంశీ…ఈయన్ని ఇండస్ట్రీ లో పెద్ద వంశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణవంశీ అనే డైరెక్టర్ కూడా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ కన్ఫ్యుజ్ అవ్వకుండా ఇలా పిలుస్తూ ఉండేవారు. ఇక ఈయన సినిమాల్లో గోదావరి అందాలు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక సినిమాలో హీరోయిన్ పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేయడంలో ఈయన మొదటి స్థానంలో ఉంటాడు.

    హీరో పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి అనే భావన నుంచి హీరోయిన్ కూడా మొదటినుంచి చివరి వరకు సినిమాలో ఉంటుంది. కాబట్టి తన పాత్ర కి కూడా ప్రాధాన్యత ఉండాలి. అని పట్టుబట్టి మరి ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను ఎక్కువగా రాసుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన మహర్షి, సితార, అన్వేషణ లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఈ క్రమంలోనే ఆయన సితార, అన్వేషణ అనే సినిమాలు చేస్తున్న సమయంలో ఆ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన భానుప్రియ గారిని ప్రేమించాడట. ఈ విషయం భానుప్రియ కు కూడా తెలిసి ఆమె కూడా అతనితో కొంత సన్నిహిత్యంగా ఉండేదని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని దానికి భానుప్రియ వాళ్ళ అమ్మ అడ్డు చెప్పిందని దాని వల్లే వాళ్ల ప్రేమ బ్రేకప్ అయిందని అప్పట్లో చాలా రూమర్లు అయితే వచ్చాయి.

    ఇక ఒకప్పుడు లెజెండ్రీ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వంశీ భాను ప్రియ నుంచి బ్రేకప్ అవ్వడం వల్ల ఆయన కొద్ది రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత రవితేజ, కళ్యాణి లను హీరో హీరోయిన్లుగా పెట్టి ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సినిమాతో డైరెక్టర్ గా మరోసారి ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో అప్పటినుంచి వరుసగా కొన్ని సినిమాలైతే చేసుకుంటూ వచ్చాడు.

    వాటిలో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దానివల్ల ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోవడంతో, ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయి పోయారు. ఇక ఇప్పటికీ ఆయన సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకి అవకాశం ఇచ్చే హీరోలు మాత్రం కరువయ్యారు…